ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న వరుస సంఘటనలు ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తున్నాయి. ఇక్కడ అందరికీ ఆందోళన కలిగించే అంశం ఏమిటి అంటే, ఇప్పటి వరకు ఇవి చేస్తున్న వారు ఎవరు అని పోలీస్ వారు పట్టుకోలేక పోవటం. ఏవో చిన్న చిన్న ఘటనలలో పట్టుకున్నా, వాటి వల్ల పెద్ద ఉపయోగం లేక పోయింది. జరుగుతున్న కుట్రలు ఏమిటో చెప్పే వారు లేరు. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పోయింది చేయి కదా, రధమే కదా అంటూ లైట్ గా మాట్లాడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల కుట్ర అని తీసి పారేసారు. ఘటనలు మాత్రం, ఆగటం లేదు, జరుగుతూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగటంతో, మొత్తం విషయం హైలైట్ అయ్యింది. నాలుగు రోజుల నుంచి మొత్తం దీని చుట్టూతే నడుస్తున్నాయి. మిగతా ప్రతిపక్షాలు కూడా ఈ విషయం పై ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రామతీర్ధం వెళ్లి, జరిగిన ఘటన పరిశీలిస్తాం అంటూ, బీజేపీ, జనసేన నాయకులు ఈ రోజు ఒక పిలుపు ఇచ్చారు. అయితే వారిని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న రాత్రి నుంచే హోస్ అరెస్ట్ లు చేసారు. అన్ని జిల్లాల నాయకులను హౌస్ రెస్ట్ చేసారు. కన్నా లక్ష్మీనారాయాణ లాంటి సీనియర్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసారు.
అయితే సోము వీర్రాజు మాత్రం ఈ రోజు ఉదయం అక్కడ ప్రత్యక్షం అయ్యారు. మరి అయ్యన్ను హౌస్ అరెస్ట్ చేయలేదో, లేదా ఆయన ఎలా ఇక్కడ వరకు వచ్చారో కానీ వచ్చారు. ఇక్కడ ఒక పెద్ద సీన్ జరిగింది. పోలీసులు తోపులాటలు అంటూ హడావిడి జరిగి, మొత్తానికి సోము వీర్రాజుని జీప్ లో వేసి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే నిన్నటి వరకు అన్ని పార్టీల నేతలను పైకి వెళ్ళటానికి ఒప్పుకున్న ప్రభుత్వం, ఈ రోజు సోము వీర్రాజు ను ఎందుకు పైకి వెళ్ళనివ్వలేదో అర్ధం కాలేదు. పోలీసులు మాత్రం, మొన్న చంద్రబాబు, విజయసాయి రెడ్డి వచ్చిన సమయంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. అయితే ప్రభుత్వంతో సఖ్యతగా ఉండే సోము వీర్రాజుని ఒక్కడినే పంపించకపోవటం పై మాత్రం, సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు వీర్రాజు ఇక్కడ వరకు ఎలా వచ్చారు, అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా అని, అలాగే వీర్రాజు వెళ్తే ఏమి అవుతుంది, అనవసరంగా ప్రభుత్వమే హైప్ ఇచ్చి, చంద్రబాబు వచ్చిన రోజు ఘటన మర్చిపోవటానికి, ఇలా చేసారేమో అని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం, మొన్న జరిగిన ఘటనకు జాగ్రత్త పడ్డాం అని చెప్తున్నారు. మరి సోము వీర్రాజుకి ఈ రోజు ఎంత మైలేజి వచ్చిందో, బీజేపీ పార్టీకే తెలియాలి.