కమలంతో తన ప్రయాణం ఉండదని జనసేన ఆవిర్భావసభలో జనసేన అధ్యక్షుడు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అందరి కంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. ఇన్నాళ్లూ బీజేపీకి ఉన్న 0.50 శాతం ఓటింగ్ బలం కంటే, జనసేనకి ఉన్న 10 శాతం ఓటింగ్‌ని చూపించి అటు అధిష్టానం దగ్గర, ఇటు వైసీపీ దగ్గర మంచిగానే వెనకేసుకున్నారని బీజేపీలో టాక్ వినిపిస్తోంది. బందరులో జరిగిన ఆవిర్భావ సభా వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించారు. బీజేపీతో పొత్తులో ఉంటే ముస్లింలు దూరం అవుతారని, అందుకే తాను బీజేపీకి దూరంగా జరుగుతానని చెప్పడం ద్వారా బీజేపీతో పొత్తు తెంపేసుకున్నానని చెప్పకనే చెప్పారు. దీనిపై వైసీపీ క్యాంపులో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే టిడిపితో జనసేన జట్టు కలిగితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకుల మాట. సర్వేలు ఇదే చెబుతున్నాయి. అందుకే జనసేన టిడిపితో కలవకూడదని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. పేరుకి బీజేపీ అధ్యక్షుడైనా వైసీపీ కోసమే పనిచేస్తారనే పేరున్న సోము వీర్రాజు జనసేన బీజేపీతో కటీఫ్ చెప్పడంతో టెన్షన్ పడుతున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నపార్టీ, తనని ప్రేమగా చూసుకునే వైసీపీ అధికార కోల్పోతుందనే ఆందోళన నెలకొందట. బీజేపీతో కొనసాగేది లేదని పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సోము వీర్రాజు వెరయిటీగా స్పందించారు. జనసేన, టీడీపీ పొత్తుపై పవన్ ఎక్కడా మాట్లాడలేదని, బీజేపీ పొత్తుపైనే మాట్లాడారని, టీడీపీతో పొత్తుపై జనసేన క్లారిటీ ఇచ్చాక మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. మొత్తానికి పవన్ పొత్తు ఉండదని చెప్పడం ద్వారా సోమువీర్రాజుకి, వైసీపీకి గట్టి షాకే ఇచ్చారు.
పవన్ కొట్టిన దెబ్బకు, టెన్షన్ పడుతున్న సోము వీర్రాజు
Advertisements