కరోనా ఎఫెక్ట్ అనేది అన్ని రంగాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరో పక్క ప్రభుత్వాల ఉదాసీనత, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగం పై మరీ ఎక్కువగా పడింది. ఇదే అంశం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో, ఒక రైతు పొలం దున్నే దానికి, కాడెద్దులు లేకపోవటంతో, వాటికి అద్దెకు తెచ్చుకునే సామర్ధ్యం లేకపోవటంతో, తన ఇద్దరు కుమార్తెలను, కాడెద్దుల మార్చి, పొలం దున్నుతున్న వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక రైతు తన పొలం దున్నుకునెందుకు, అద్దెకు ఎద్దులను తెచ్చుకోలేక, ట్రాక్టర్ ను అద్దెకు తెచ్చోకోలేక, తన కూతురుల చేత, పొలం దున్నిస్తున్నాడు అంటే, రాష్ట్రంలో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా కానీ, ఆధుణీకర వ్యవసాయం కానీ, మాటలు వరుకే అని అర్ధం అవుతుంది. ముఖ్యంగా కౌలు రైతులు, అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటి ఇబ్బందుల్లోదే, ఈ సంఘటన కూడా. అయితే కూతుళ్ళు చేత పొలం దున్నించే వీడియో వైరల్ కావటంతో, ప్రముఖ నటుడు సోను సూద్, ఈ వీడియో చూసి చేలించిపోయారు. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, వారికి రేపు ఉదయానికి వారికి కాడెద్దులతో పాటుగా, ఒక ట్రాక్టర్ కూడా ఇస్తానని, ఆ పిల్లలను చదివించాలని కోరారు. వారు పూర్తిగా చదువుకోవాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ఊపందుకోవటంతో, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోవలోదే, ఈ సంఘటన కూడా. అయితే, సోనూ సూద్ స్పందన పై పలువురు ప్రసంశలు గుప్పిస్తున్నారు. నారా లోకేష్ స్పందిస్తూ, కృతఙ్ఞతలు చెప్పారు. అయితే, ఇది ఇలా ఉంటే, ఎక్కడో పక్కన ఉన్న ఆక్టర్లు స్పందిస్తున్నారు కానీ, మన టాలీవుడ్ నటులు మాత్రం, ఇవామీ మనకు పట్టవు అన్నట్టు, పాలకుల భజనలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా, సోనూ సూద్ ను అభినందించిల్సిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read