గుడ్డలూడదీస్తాం... మడిచి ఎక్కడో పెట్టుకో... ఈ మాటలు అన్నది ఎవరో దారిన పోయే వారో లేక, సాదా సీదా గల్లీ రాజకీయ వేత్తో కాదు. ఒక శాసనసభకు స్పీకర్. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. ఒక సభలో, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక స్పీకర్ సంబోధించిన మాటలు ఇవి అంటే, ఆశ్చర్యం కలగక మానదు. ఈ మాటలు అన్నది, ఆంధ్రర్పదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం. మొన్నా మధ్య కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ్మినేని సీతారం, ఈ రోజు చంద్రబాబుని పేరు పెట్టి మరీ పిలిచి, ప్రజల ముందు గుడ్డలూడదీస్తాం, నీ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చెయ్యటం సంచలనంగా మారింది. సహజంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఎంతో హుందాగా, రాజకీయాలకు అతీతంగా ఉంటారు. అలాంటిది, ఇక్కడ ఒక ప్రతిపక్ష నేత పై, మనసులో ఇంట కక్ష, పగ పెట్టుకుని, స్పీకర్ స్థానంలో కూర్చుంటున్నారు.
ఈ రోజు అగ్రిగోల్ద్ బాధితులకు జగన్ ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తమ్మినేంటి, అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ పన్నాగం పన్నారని అన్నారు. చంద్రబాబు బండారం మొత్తం బయటపెడతామని అన్నారు. చంద్రబాబుని ప్రజలముందు గుడ్డలూడదీసి నుంచో పెడతాం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో అనుభవం ఉందని డబ్బా కొట్టే చంద్రబాబు, ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అందరకీ 10 వేలు ఇస్తానని చెప్పి, బాధితులు పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా వారికి చెల్లింపులు చెయ్యలేదని అన్నారు.
తాను ముందు ఎమ్మెల్యేని అంటి, తరువాతే స్పీకర్ ని అని, అన్ని విషాయల పై స్పందిస్తానని, చంద్రబాబు చేసిన మాయలు అన్నీ బయట పెడతానని, యనమల, సియం రమేష్ కి కూడా, ఈ కుట్రలో భాగం ఉందని అన్నారు. అయితే స్పీకర్ గా ఉంటూ రాజకీయ విమర్శలు చెయ్యకూడదు, అది నైతికం. అయితే తమ్మినేని రాజకీయ విమర్శల వరకు చెప్పి ఉంటే బాగానే ఉండేది కాని, ఇలా నోటికి వచ్చినట్టు, సామాన్య ప్రజలు రోడ్డు మీద మాట్లాడిన మాటలు మాట్లాడటం మాత్రం తప్పు. ఒక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్, ఇంత వల్గర్గ మాట్లాడడం చాలా బాధాకరం. పదవి కంటే ముఖ్యం సంస్కారం. భవిష్యత్తులో మహిళా సోదరీమణులు వార్తలు కూడా వినలే రేమో. ప్రజలు గమనిస్తున్నారు, కనీసం మాట్లాడే విధానం మార్చుకోండి. మీరు స్పీకర్ గా ఈ వ్యాఖ్యలు చెయ్యలేదు, ఎమ్మెల్యేగా ఈ వ్యాఖ్యలు చేసాను అంటున్నారు కాబట్టి, ఆ హోదాకు అయినా, గౌరవం ఇచ్చి, మాట్లాడాలని మనవి.