ఈ రోజు లోకసభ స్పీకర్ ఓం బిర్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఈ సందర్భంగా ఏపికి సంబంధించిన రఘురామకృష్ణం రాజు అనర్హత పిటీషన్ తో పాటుగా, అనర్హత వేటు వేయకపోతే సభను స్థంబింప చేస్తాం, స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై విలేఖరులు అడగగా, స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ రఘురామకృష్ణం రాజు అనర్హత పిటీషన్ పై స్పందిస్తూ, ఎవరైనా ఒక సభ్యుడు పైన అనర్హత వేటు వేయాలి అంటూ పిటీషన్ ఇస్తే, దానికి సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుందని, ఆ ప్రక్రియ ప్రకారమే మొత్తం జరుగుతుందని ఓం బిర్లా అన్నారు. అంతే కాని, దీని పైన ఏమి జరుగుతుంది అంటూ, రన్నింగ్ కామెంటరీ చేయలేం అని, ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో అందరికీ తెలుసని, తాము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఇరు పక్షాల వాదనలు తప్పకుండా వింటాం అని, ఎవరి వాదనలు వినకుండా, లేదా ఒకరి వాదనలే విని, నిర్ణయాలు తీసుకోమని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. తప్పకుండా ఇదంతా నిబంధనలు ప్రకారం, ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలియ చేసారు. అంతే కాకుండా, విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, మేము ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు అని చెప్పిన విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై కూడా స్పీకర్ స్పందించారు.
అలాగే విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, అనర్హత వేటు వేయకపోతే సభను స్థంబింప చేస్తాం అంటూ చేసిన వ్యాఖ్యల పై కూడా స్పందించారు. నిరసన తెలియ చేసే అధికారం ప్రతి సభ్యుడికి ఉంటుందని అన్నారు. ఎవరైనా నిరసన తెలియచేయవచ్చు అని అన్నారు. ఏదైనా అంశం ప్రస్తావించాలి అంటే నిబంధనలు ఉంటాయని, ఆ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే రఘురామకృష్ణం రాజు, తన పై సిఐడి పోలీసులు వ్యవహించిన తీరు పై సభలో చర్చ జరపాలి అంటూ, ఆయన చేసిన విజ్ఞప్తి గురించి కూడా ఓం బిర్లా స్పందించారు. రఘురామకృష్ణం రాజు నిబంధనలు ప్రకారం నోటీసులు ఇస్తే, దాని పై తప్పకుండా నిబంధనలు ప్రకారం, పార్లిమెంట్ వ్యవహరించి, అవకాసం ఉంటే చర్చిస్తామని అన్నారు. రఘురామకృష్ణం రాజు తన పై జరిగిన అంశం విషయంలో ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్ ని కూడా, ప్రివిలేజ్ కమిటీకి పంపినట్టుగా స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. మొత్తం మీద వచ్చే పార్లమెంట్ సమావేశాలు, దీని చుట్టూతా తిరగనున్నాయి.