ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, తమ్మినేని సీతారంకు, ఢిల్లీలోని ఏపి భవన్ లో అవమానం జరిగింది అంటూ, పత్రికల్లో కధనాలు వచ్చాయి. ఆ కధనాలు ప్రకారం, ఏపి భవన్ కు వచ్చిన తమ్మినేని సీతారం, రాష్ట్ర అతిధిగా వచ్చినా, ఆయన గౌరవ మర్యాదలకు, ప్రోటోకాల్ నిబంధనలు తుంగలోకి తొక్కారని, ఏపి భవన్ అధికారుల పై ఆయన మనస్తాపం చెందారు. డెహ్రాడూన్‌ పర్యటన తరువాత, తమ్మినేని సీతారం, సతీసమేతంగా, ఢిల్లీలోని ఏపి భవన్ కు చేరుకున్నారు. తమ్మినేని సీతారంకు, ఏపి భవన్ లోని స్వర్ణముఖి బ్లాకులోని 320 గెస్ట్‌ రూమ్‌ను కేటాయించారు. అయితే, ఈ సందర్భంలో, తమ్మినేని ఆదివారం సాయంత్రం, రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అయ్యే హడావిడిలో ఉండగా, ఏపి భవన్ అధికారులు వచ్చి, ఆయనకు షాక్ ఇచ్చారు. ఏపి భవన్ ఉద్యోగి ఒకరు, వచ్చి, ఆయనకు ఒక కవర్ ఇచ్చారు, ఆ కవర్ ఇస్తూ, సార్‌, మీ భోజన, వసతి బిల్లు కట్టమన్నారు, ఈ పుస్తకం పై, మీ సంతకం చెయ్యండి అంటూ, ఆ ఉద్యోగి తమ్మినేనిని కోరారు.

spekaer 23122019 2

అయితే ఈ పరిణామం పై, తమ్మినేని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఒక స్పీకర్ గా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనకు, ఇలా బిల్లు అడగటం ఏమిటి అంటూ, తమ్మినేని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే దీనికి సమాధానం ఇస్తూ, ఆ ఉద్యోగి, సార్‌, మీకు కేటగిరీ-1 కింద విడిది ఇచ్చారు. అమరావతిలో ఉండే సాధారణ పరిపాలనా విభాగంనుంచి స్టేట్‌ గెస్ట్‌గా కాకుండా కేటగిరీ-1లో మీకు వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. దాని వల్ల, ఈ పొరపాటు జరిగిందని వారు తెలిపారు. అనుకోకుండా పొరపాటు జరిగిందని, ఈ ఇబ్బందికి చింతిస్తున్నామని, కాని బిల్ జేనేరేట్ అవ్వటంతో, బిల్ కట్టాల్సి ఉంటుంది అంటూ, ఆ ఉద్యోగి, తమ్మినేనికి విషయం చెప్పారు.

spekaer 23122019 3

అయితే అంతా విన్న తమ్మినేని, అనవసరంగా ఇష్యూ ఎందుకు, ముందు బిల్లు ఎంత వచ్చిందో,అంతా కట్టేయండి, తరువాత జరిగిన సంగతి నేను చూసుకుంటూ అంటూ, తమ్మినేనని తన సిబ్బందిని ఆదేశించారు. అయితే, ఇదే సమయంలో, అక్కడ జరిగిన విషయం పై, తమ్మినేని సతీమణి వాణి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బు గురించి, బిల్లు గురించి కాదని, ఎంతైనా ఇచ్చేస్తాం అని, కాని రాష్ట్ర అతిధి హోదాలో వచ్చిన తమకు, అదీ కాక ఒక స్పీకర్ కు ఇలా అవమానం చేస్తారా ? స్పీకర్‌ను కూడా ఈ అధికారులు గౌరవించలేదు అని అసహనం వ్యక్తంచేశారు. అయితే జరిగిన విషయం పై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా విచారం వ్యక్తం చేస్తూ, స్పీకర్ కు జరిగిణ అవమానానికి చింతిస్తున్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read