తమ్మినేని సీతారాం తన వ్యవహార శైలితో రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిని దిగజార్చుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ద్వజమెత్తారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ....తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి దక్కలేదని జగన్ పై ఉన్న అక్కసు టీడీపీపై వెల్లగక్కడం ‍హాస్యాస్పదం. తనకు పదవులు అవసరం లేదని అంటున్న తమ్మినేని దమ్ముంటే స్పీకర్ ‎ పదవికి రాజీనామా చేయాలి. ఏ ఎండకు ఆగొడుకు పట్టే ఊసరవెళ్లి తమ్మినేని సీతారాం. స్పీకర్ పదవి పోతుందన్న భయంతోనే ‎టీడీపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. గతంలో టీడీపీపై అవాకులు చెవాకులు పేలిన కొడాలి నాని, పేర్నినానిల పరిస్థితి ఏంటో స్పీకర్ గమనించాలి. మంత్రి వర్గ విస్తరణలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని తమ్మినేని అంటున్నారు. దళిత మహిళను మంత్రి పదవి నుంచి తొలగించటం ఏ సామాజిక న్యాయమో చెప్పాలి? సామాజిక న్యాయం పాటిస్తే జగన్ ని వైసీపీ కార్యర్తలే ఎందుకు తిడుతున్నారు? టీడీపీ హయాంలో కళింగ సామాజికవర్గానికి 9 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. కానీ జగన్ రెడ్డి పాలనలో ఆ సామాజికవర్గానికి ఏం న్యాయం జరిగింది? మంత్రివర్గ విస్తరణ దామాషా ప్రకారం కాదు తమాషాగా జరిగింది. ఓసీల్లో వైశ్యులు, బ్రాహ్మణులు వంటి అగ్ర కులాలు ఈ రాష్ట్రంలో లేరా? వారికి పాలనలో ప్రాతినిధ్యం అక్కర్లేదా? జగన్ రెడ్డి డమ్మీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పెత్తనమంతా సకలశాఖమంత్రి సజ్జలకు కట్టబెట్టారు. డమ్మీ మంత్రి పదవులు, కుర్చీలు లేని కార్పోరేషన్ల వల్ల బీసీలకు ప్రయోజనం ఏంటి? కార్పోరేషన్లకు కనీసం ఒక్క రూపాయి ఖర్చు చేశారా?

tammineni 12042022 2

బీసీగా పుట్టిన తమ్మినేని జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటం సిగ్గుమాలిన చర్య. జగన్ రెడ్డి మాయమాటలు, తమ్మినేని తమ్మా బుసు మాటలు వినేందుకు రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. చేతకాని అవినీతి, అసమర్ద‎ వైసీపి నేతలకు టీడీపీని విమర్శించే నైతిక అర్హత లేదు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చి రాజ్యాధికారం వైపు నడిపించిన పార్టీ టీడీపీ. టీడీపీ హయాంలో సంక్షేమ పధకాలు అమలు చేయలేదా? ప్రతినెలా ‎ 54 లక్షల మందికి ఫించన్లు ఇవ్వలేదా? ఇప్పుడు ఫించన్లు జగన్ తన తాత ఆస్తిలో నుంచి ఏమైనా ఇస్తున్నారా? టీడీపీకి డిపాజిట్లు రావని తమ్మినేని అంటున్నారు, తనకు దమ్ముంటే రాజీనామా చేయ్ , నిన్ను ఆముదాల వలస ప్రజలు పంచ ఊడదీసి పరిగెత్తించేందుకు సిద్దంగా ఉన్నారు. ‎ ఆముదాల వలసలో తండ్రి కొడుకుల అవినీతి, అరాచకాలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మీ ఇసుక దోపిడి, ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులు తీసుకున్న డబ్బులు ఇవన్నీ ప్రజలకు తెలియవనుకుంటున్నారా? రాష్ట్రంలో ఏ1 ఇసుక డాన్ తమ్మినేని ఇసుక అక్రమ రవాణాతో రోజుకు రూ. కోటి దోపిడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలసలో తమ్మినేనిని ప్రజలు పంచఊడదీసి తరమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని, ‎ టీడీపీ 160 సీట్లు గెలవటం ఖాయమని కూన రవికుమార్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read