ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు. స్పీకర్ గా ఉంటూనే, రాజకీయ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శలు చాలా సార్లు గీత దాటాయి కూడా. సామాన్య ఎమ్మెల్యేలు కూడా అలా ఘాటుగా మాట్లాడటానికి ఆలోచిస్తారు కాని, తమ్మినేని మాత్రం, స్పీకర్ గా ఉంటూ, ఘాటు రాజకీయ విమర్శలకు వెనుకాడారు. కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు, గుడ్డలు ఊడదీసి నుంచో పెడతాం, మడిచి ఎక్కడో పెట్టుకోండి అంటూ, చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాగే అసెంబ్లీలో కూడా, ప్రతిపక్షాలు ఏమైనా ఆందోళన చేసిన, పౌరుషంగా మాట్లాడినా, వారి పై వెంటనే ఎదురు దాడి చేసి, వారిని కంట్రోల్ చేస్తారు. అలాగే ఫిరాయింపుల పై, ఎంతటి వారినైనా వదిలేది లేదని, పార్టీ ఫిరాయిస్తే, వెంటనే అనర్హత వేటు వేసేస్తానంటూ ఒకటి రెండు సార్లు, చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఇలాంటి స్పీకర్ పై, రాం గోపాల్ వర్మ లాంటి వాడు, పేరడీ చెయ్యాలని చూస్తూ ? వామ్మో ఇంకా ఏమన్నా ఉందా.

tammineni 24112019 2

ఇంత ఖటినమైన స్పీకర్ జోలికి రాం గోపాల్ వర్మ వస్తే, అతని పని మటాష్ అని అందరూ అనుకుంటారు. అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ, సమాజాన్ని కులంతో విడగొట్టే, పిచ్చి సినిమాలు తీసే రాం గోపాల్ వర్మ, ఈ సినిమాలో చంద్రబాబుని, లోకేష్ ని, కేఏ పాల్ నే కాదు, స్పీకర్ తమ్మినేని సీతారంని పోలిన క్యారక్టర్ ను కూడా, సినిమాలో చూపించారు. దీనికి సంబంధించి, ఒక ఫోటో వర్మ పోస్ట్ చేసారు. అందులో అలీ స్పీకర్ గా ఉంటూ, అసెంబ్లీలో నిద్ర పోతూ ఉంటారు. ఆ ఫోటో పోస్ట్ చేసి "Ali is playing speaker Pammineni RamRam in KAMMA RAJYAMLO KADAPA REDDLU" అంటూ పోస్ట్ చేసారు. స్పీకర్ తమ్మినేని సీతారం ని పోలినట్టు, ఆ వేష ధారణ ఆలీకి వేసి, ఆ క్యారక్టర్ పేరు కూడా "పమ్మినేని రాం రాం" అంటూ పెట్టారు.

tammineni 24112019 3

అయితే రాజకీయ నాయకులను చులకను చేసే చూపిస్తే, అది వేరే విషయం. కాని ఏకంగా స్పీకర్ ని ఇలా చెయ్యటం, చూసి, అలాగే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారం వ్యక్తిత్వం చూసిన వాళ్ళు, రాం గోపాల్ వర్మకు మూడిందిలే అనుకున్నారు. కాని, ఆ ఫోటో వచ్చిన దగ్గర నుంచి , వైసీపీ నాయకులు ఎవరూ స్పందించలేదు. నిన్న స్పీకర్ తమ్మినేని, అసెంబ్లీ సమావేశాల గురించి మీడియాతో మాట్లాడుతూ ఉండగా, ఈ విషయం పై విలేఖరులు ప్రశ్న అడగగా, "అసెంబ్లీ స్పీకర్‌ ఛైర్‌ ను అగౌరవపరిచే విధంగా ఎవరూ మాట్లాడకూడదని, అసెంబ్లీ స్పీకర్‌ అంశాన్ని రామ్‌గోపాల్‌ వర్మ చిత్రీకరించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు." అయితే ఇంత సింపుల్ గా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని స్పీకర్ ఎందుకు అన్నారో ఎవరికీ అర్ధం కాలేదు. బహుసా, ఈ సినిమా నిర్మాత వైసీపీ వాళ్ళు కాబట్టి, అలాగే ఈ సినిమా చంద్రబాబుని, లోకేష్ ని అల్లరి చేసేలా ఉంది కాబట్టి, వైసీపీ పార్టీ వాళ్ళు, ఎవరూ ఏమి అనటం లేదు ఏమో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read