మన ఘనత వహించిన ప్రతిపక్ష నాయకుడు, జగన్ మోహన్ రెడ్డికి, అసలు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి ఉపయోగమో ఇప్పటి వరకు తెలియదు. మొన్నా మధ్య అసలు పోలవరంలో స్టోరేజ్ క్యపాసిటీ ఎక్కడ ఉంది ? అసలు ఇక్కడ నీళ్ళు రాయలసీముకు ఎలా వెళ్తాయి అంటూ, చంద్రబాబుతో వితండవాదం చేసారు. చంద్రబాబు దాదాపు గంట సేపు చెప్పినా, అదే తంతు.. దీంతో చంద్రబాబు, మీ అందరికీ ట్యూషన్ పెట్టాలి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయినా, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డికి అర్ధం కావటం లేదు. ఆ అర్ధం లేని జ్ఞానంతోనే, రోడ్లు వెంట తిరుగుతూ, ప్రజలకు ఏవేవో చెప్తున్నాడు.. దీంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమకు చిర్రేత్తుకు వచ్చింది. సాగు నీటి రంగంపై ప్రతిపక్ష నేత జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని, అవసరం అయితే ఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధమని ఉమా అన్నారు.

jagan 09062018 2

విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున జల సంరక్షణ చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం చేశారు. ఆ ఫలాలనే వైకాపా నేతలు అనుభవిస్తున్నారన్నారు. పులిచింతల నీళ్లు ఎక్కడకు వెళ్తున్నాయో జగన్‌కు తెలియదని, రాష్ట్ర ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే తత్వమే లేదని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన వ్యక్తి రోడ్లపై తిరుగుతూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌కు అంతా అవినీతే కనిపిస్తోందని ఉమ అన్నారు. నాలుగేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 54 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్ష పార్టీలు ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagan 09062018 3

రాష్ట్రంలో భూగర్భ జలాలు 2 మీటర్ల మేర పెరిగాయని, రాష్ట్ర సగటు 12.80 మీటర్ల పైకి వచ్చిందని, తద్వారా రూ. 400 కోట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. రాయలసీమలో 6 మీటర్ల మేర భూగర్బ జలాలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం జలాశయాల్లో 237 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జూన్ 18 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయా ఫ్రామ్ వాల్‌ను జాతికి అంకితం చేస్తారన్నారు. వైకాపా మూడేళ్లుగా రాజీనామా డ్రామాలు ఆడిందని, ఇప్పటికీ వాటిని ఆమోదించు కోలేక పోయారని విమర్శించారు. ఎన్నికలు రావనే ధైర్యం తో ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read