ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు మద్దతుగా, కేంద్రం తీరును నిరసనగా ఈ రోజు ఉదయం స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర చేపట్టారు. వేలాది మందితో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు యాత్ర కొనసాగనుంది. రేపు నరసరావుపేట, సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల దీక్ష చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ప్రతీ ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని స్పీకర్ కోరారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సందరభంగా, స్పీకర్ సైకిల్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. అయితే గాయాన్ని కూడా లెక్క చేయకుండా స్పీకర్ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు.
స్పీకర్ కోడల మాట్లాడుతూ రాష్ట్రానికి ఏర్పాటు లొనే అన్యాయం జరిగిందని రాజ్యంగా విరుద్ధంగా,న్యాయ విరుద్దంగా, ధర్మ విరుద్ధం గా రాష్ట్రాన్ని విడతీసారని గడచిన 4 సంవత్సరాలలో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు,కేబినేట్ తీర్మాణాలన్ని తుంగలోతొక్కరని స్పీకర్ పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఈ రోజుకైనా మేల్కొకపోతే మన రాష్ట్రం శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని కోడెల తెలియచేసారు.. దీనికి వ్యతిరేకంగా అన్ని వ్యవస్థలు, చట్ట సభలు, అధికార యంత్రంగం, రాజకీయ యంత్రంగం, పోరాటం చేస్తున్నారని.
ఒక శాసనసభ స్పీకర్ గా తనకు పరిధులున్నా వాటితో పాటు భాద్యతలు కూడా ఉంటాయని అందుకే 5 కోట్ల మంది ప్రజలకు నష్టం జరిగినప్పుడు తాను చూస్తూ ఉరుకోలేనని, ఈ సైకిల్ యాత్ర ని ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో చేయడం లేదని రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రజల యొక్క పోరాటాన్ని కేంద్రానికి తెలిసేల చేసి కేంద్రాన్ని ఒత్తిడి చేయడం కోసమే ఈ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటికైనా కేంద్ర దిగి వచ్చి రాష్ట్రానికి చేయవలసిన అన్ని సహాయ సహకారాలు అందచేయక పోతే 5 కోట్ల తెలుగు వారు నష్టం జరిగితే ఎలా ఎదురు తిరుగుతారో కేంద్రానికి తెలియచేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని స్పీకర్ తెలిపారు...