గాలి జనార్దన్ రెడ్డి... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అక్రమ మైనింగ్ లో, ఒక పీకు పీకాడు... జగన్ సొంత కొడుకు అయితే, గాలి నా పెద్ద కొడుకు అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్తూ ఉండే వారు... అలాగే, జగన్ లక్ష కోట్లు కొట్టేస్తే, పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డి కొట్టేసిన అక్రమ మైనింగ్ లెక్క అంతా ఇంతా కాదు.. చివరకు ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అనుకోండి... అయితే గాలి మళ్ళీ బీజేపీలోకి రావటం, త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో, బీజేపీ తరుపున పోటీ చేస్తారు అనే వార్తలు రావటంతో దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది... దీంతో బీజేపీ అసలకే మోసం వస్తుందని, గాలి జనార్ధన్ రెడ్డికి మాకు సంబంధం లేదు అని చెప్పింది...
కాని లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంది... అందులో భాగంగా, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, శ్రీరాములుకు డిప్యూటీ సియం పదవి ఇస్తామని, కొన్ని జిల్లాల ఎన్నికలు ఖర్చు గాలి పెట్టుకోవాలని ఒప్పందం కుదిరింది... బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, బి. శ్రీరాములు. గతంలో బీజేపీకి రాజీనామా చేసిన శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీని స్థాపించారు. కర్ణాటకలో దాదాపు అన్ని నియోజక వర్గాల నుంచి బీఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థులను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయించారు. తరువాత కాలంలో, గాలి జైలు నుంచి వచ్చిన తరువాత, మళ్ళీ బీజేపీలో చేరాడు...
ఈ నేపథ్యంలో శ్రీరాములుపై రాళ్ల దాడి చర్చనీయాంశమైంది. శ్రీరాములుకు చిత్రదుర్గ జిల్లాలోని మొల్కలమూర్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ టికెట్ కేటాయించింది. ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాములకు టికెట్ కేటాయించినందుకు నిరసనగా ఆయన కాన్వాయ్‌పై తిప్పేస్వామి వర్గీయుల దాడి చేసినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు తిప్పేస్వామి వర్గీయులను చెదరగొట్టారు... ఇవన్నీ చూస్తున్న విశ్లేషకులు, రేపు జగన్ పరిస్థితి కూడా ఇంతే అని చెప్తున్నారు... ఒప్పందంలో భాగంగా, బీజేపీ - వైసిపీ కలవాల్సిన పరిస్థితి... అప్పుడు జగన్ ను కూడా ఇలాగే వాడుకుని వదిలేస్తారు బీజేపీ పెద్దలు... జగన్ పై ఉన్న కేసులు, కొంత కాలం లేట్ చెయ్యవచ్చు కాని, శిక్ష నుంచి తప్పించటం కుదరదు అనే విషయం గుర్తు చేస్తున్నారు...