రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య, హాట్ హాట్ గా ఆరోపణలు ప్రత్యారోపణుల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, ప్రతి ఒక్కరి పై, ట్విట్టర్ లో హేళనగా మాట్లాడటం చూస్తూ ఉంటాం. అలాగే, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్ మతుకుమిల్లి పై ట్విట్టర్ లో స్పందించారు. "నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. @ncbn దొంగల ముఠా, ఆయన @BJP4India లోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు." అంటూ ఘాటుగా ట్విట్ చేసారు. అయితే, దీని పై భరత్, అంతే ధీటుగా, విజయసాయి రెడ్డికి ఒక బహిరంగ లేఖ ద్వారా, స్పందించారు. అసలు ఆ అప్పు ఎందుకు అయ్యిందో చెప్తూ ఇచ్చిన లేఖతో, జగన్ ప్రభుత్వం పైనే విమర్శలు చేసారు. ఇది ఆ లేఖ.

bharat 19102019 2

"విజయసాయి రెడ్డి గారు...ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవి లో ఉన్నారు. మీరు అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాము. కానీ అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ప్రజలకు నిజాలు తెలియాలి. విదేశాలలో ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారంలో రాణించడంతో పాటు పర్యావరణ హితంగా కూడా ఏదైనా చేయాలనే సంకల్పంతో 2016లో మా తండ్రిగారి సాయంతో విజయనగరం జిల్లా గరివిడి లో ఒక చిన్న 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ని నెలకొల్పాను. వి బి సి రెన్యూబుల్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ పేరు తో స్థాపించిన మా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, ఎ పి ట్రాన్స్ కో తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 2016 నుంచి ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఏ పి ట్రాన్స్ కో నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ.3 కోట్లు. ఆంధ్రా బ్యాంకు నుండి మేము తీసుకున్న రుణం రూ.15.84 కోట్లు కాగా మేము ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా రుణ చెల్లింపుల తో అది రూ. 13.65 కోట్లకి తగ్గింది. "

bharat 19102019 3

"బ్యాంక్ కు మా సంస్థ చెల్లించవలసింది లోన్ వాయిదాలు దాదాపు రూ.2 కోట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ. 3 కోట్లు. ట్రాన్స్ కో గనుక మాకు సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే బ్యాంకు రుణం సమయానికి చెల్లించేవాళ్ళం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో వున్నందున బకాయిలు కోసం వినతులు సమర్పిస్తూ ఎదురు చూస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న మీరు, ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితి లో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం. ఇది నా ఒక్కరి పరిస్థితే కాదు. మన రాష్ట్రంలో వందల పరిశ్రమలు, వ్యాపారస్తుల పరిస్థితి ఇలాగే వుంది. ప్రభుత్వం నుండి సకాలంలో బిల్లులు రాక పోవడం వల్ల కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పడి ఆ సంస్థలు మనుగడ సాగించలేక పోతున్నాయి.ఒక ఆడిటర్ గా వీటి గురించి మీకు తెలియంది కాదు. కావున ప్రస్తుత పరిస్తితులు చక్కదిద్దే విధంగా పరిశ్రమలను నిలదోక్కుకునేలా మీ సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారని ఆశిస్తున్నాను.. మీకు వీలైతే ఔత్సాహిక పరిశ్రమలను ప్రోత్సహించండి కాని నాలాంటి వారిని అవమానపరిచేలా వ్యవహారించవద్దని విన్నవిస్తున్నాను..."

Advertisements

Advertisements

Latest Articles

Most Read