తితలీ తుఫాను పై బుధవారం రాత్రి 10 గంటలకు మొదలైన చంద్రబాబు సమీక్షలు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి శ్రీకాకుళం చేరుకున్న చంద్రబాబు, ఈ రోజు ఫీల్డ్ లో దిగనున్నారు. తితలీ తుఫానుతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకునేదాకా ఉన్నతాధికారులంతా అక్కడే ఉండాలన్నారు. పంటలకు జరిగిన నష్టం, వాటి పరిస్థితిని సమీక్షించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించాలన్నారు. బుధవారం రాత్రి నుంచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం.. గురువారం రాత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గం గుండా శ్రీకాకుళం చేరుకున్నారు.

srikakulam 12102018 2

జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులకు 50కేజీల చొప్పున, ముంపు గ్రామాల్లో 25 కేజీల చొప్పున బాధితులకు తక్షణం బియ్యం అందిస్తామని తెలిపారు. పార్టీ యంత్రాంగం, ప్రజలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆర్‌ అండ్‌ బీకి చెందిన 22 రహదారులను శుక్రవారంనాటికే బాగుచేయాలన్నారు. విద్యుత్తు సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌లోకి వరద నీటిని మళ్లించాలన్నారు. ముందస్తు చర్యల ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగామంటూ... జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను నష్టానికి సంబంధించి చిత్రాలను సీఎం చూశారు. మరణించిన వారికి నష్టపరిహారం తక్షణమే అందించాలని అధికారుకు ఆదేశించారు.

srikakulam 12102018 3

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సమీక్షించారు. ఆర్టీజీఎస్‌ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తే నిద్ర మానుకుని అరగంటకోసారి పర్యవేక్షిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బుధవారం సాయంత్రానికి తిరిగి వచ్చారు. 6 గంటలకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరులశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అమలు తీరుపై మరోమారు ఆరా తీశారు. తీరం దాటిన సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు సీఎం ఇంకోసారి అధికారులతో మాట్లాడారు. గురువారం ఉదయం 10.25 గంటలకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి గంటా మనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. సహాయ పునరావాస చర్యలే కీలకమని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read