కేంద్రం అనుసరించిన వైఖరిపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో రూపాయి ఖర్చు లేనిది, కేవలం మోడీ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది ఏదన్న ఉంది అంటే, అది వైజాగ్ రైల్వే జోన్.. అయితే ఇప్పుడు దీన్ని కూడా పక్కన పడేసింది కేంద్రం... మొన్నటి దాక, అదిగో రైల్వే జోన్, ఇదిగో రైల్వే జోన్ అంటూ ఊరించారు... బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో, రైల్వే జోన్ తీసుకువచ్చి తీరుతాం, మా కేంద్రం పై, మాకు నమ్మకం ఉంది అంటూ, హడావిడి చేసారు... ఈ నేపధ్యంలో, ఈ విషయంలో రూపాయి ఖర్చు లేదు కాబట్టి, కనీసం ఇదైనా మన రాష్ట్రానికి వస్తుంది అని, అందరూ భావించారు.. కాని కేంద్రం, మన పై కక్ష కట్టింది... రైల్వే జోన్ లేదు అనే సంకేతాలు ఇస్తుంది..
అయితే ఇదే అంశం పై, విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఒకటైన విశాఖకు రైల్వేజోన్ అంశంపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష చేపట్టారు. విశాఖకు రైల్వేజోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం రోడ్డు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస రైల్వే స్టేషన్‌కి తమ కార్యకర్తలతో వచ్చిన ఆయన అక్కడే 12 గంటల దీక్షను ప్రారంభించారు. రేపు ఉదయం 7 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని, హోదాతో పాటు రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు అని అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీని దెబ్బతీయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని. ఒడిశా అభ్యంతరం చెప్పకపోయినా కేంద్రం మోకాలడ్డుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై కేంద్రం కుట్రలు పన్నుతోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఏపీకి రైల్వేజోన్ ఇచ్చేస్తున్నాం అని, ఒడిశాతో చర్చలుజరుపుతున్నామని, అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాత, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటిస్తామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగానే, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగింది. విభజన హామీలు నెరవేర్చాలని తెలుగుదేశం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో, రెండు నెలల నుంచి అసలు రైల్వే జోన్ అంశమే కేంద్రం పట్టించుకోవటం లేదు...