శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న మంత్రిగా ఉంటూ, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఉన్న ధర్మాన కృష్ణ దాస్, చంద్రబాబు పై తీవ్ర పదజాలం వాడారు. బూతులు తిట్టారు. కావాలంటే రాసుకోండి, అంటూ మీడియాతో అన్నారు. అయితే ఒక పక్క ఇప్పటికే కొడాలి నాని బూతులతో, ఇప్పటికే చెవులు పగిలిపోతుంటే, మరో మంత్రి కూడా ఇదే విధంగా మాట్లాడటం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి, వీరని కనీసం ఖండించకపోవటం గమనార్హం. ఇక పొతే, ధర్మాన కృష్ణ దాస్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. ఉదయం నుంచి అనేక ఆందోళన కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ, ఈ రోజు సాయంత్రం, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు నేతలు కలిసి వెళ్లారు. మంత్రి వ్యాఖ్యలును నిరసిస్తూ, పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చెయ్యటానికి వచ్చిన వారిలో, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవి, ఎమ్మెల్యే అశోక్, పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
అయితే అదే సమయంలో వైసిపీ వర్గీయులు కూడా పోలీస్ స్టేషన్ కు రావటంతో, స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోపల వైసీపీ వాళ్ళు ఉన్నారని, తెలుగుదేశం నేతలను పోలీస్ స్టేషన్ గేటు బయటే ఆపేసారు. లోపల ఉన్న కళా వెంకట్రావ్ ను కూడా బయటకు పంపించారు. దీంతో తెలుగుదేశం నేతలు గేటు వద్దే నిరసన తెలిపారు. మేము కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చామని చెప్పగా, ఇక్కడే కంప్లైంట్ తీసుకుంటామని పోలీసులు చెప్పటంతో, తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. మేము లోపలకు వచ్చే కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. దీంతో, పోలీసులకు, తెలుగుదేశం నేతలకు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నా స్టేషన్ లోపలకు వారిని వెళ్ళనివ్వకుండా అపాటం పై, తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. చివరకు ధర్మాన కృష్ణ దాస్ పై కంప్లైన ఇచ్చి వచ్చారు. టిడిపి-పోలీస్ మధ్య జరిగిన వాగ్వివాదం, ఈ వీడియోలో చూడవచ్చు.. https://youtu.be/YQ-frsLoUHo