విధి అంటే అదే. కొద్దీ గంటల క్రితం వరకు అతను జిల్లాకు ఎస్ పి. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ ఎస్ సర్ అని సెల్యూట్ కొట్టేవాళ్ళు. బదిలీ అయింది. తనదొక ఫిర్యాదు ఉంది. టు టౌన్ పోలీస్ స్టేషన్ కెళ్ళి అయ్యా ఇదీ నా విన్నపం, న్యాయం చెయ్యండి అని దరఖాస్తు పెట్టాడు. విధి అంటే అదే. అదే విధి విజయ సాయి రెడ్డి ని వెంటాడబోతోంది. తప్పుడు ఆరోపణలు చేసి ఢిల్లీ లో ప్రెస్ మీట్లు పెట్టి విర్రవీగే తాను ఇప్పుడిక శ్రీకాకుళం టు టౌన్ SI ముందు దోషిగా నిలబడి సంజాయిషీ ఇచ్చుకోబోతున్నాడు. ఎంత సంజాయిషీ ఇచ్చినా ఇవ్వాళ కాకపోతే రేపు దోషి గా నిర్ధారణ తప్పదు, శిక్ష తప్పదు. ఇది ఎవరి గొప్పదనమో కాదు. సత్యం, ధర్మం, న్యాయం - ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. ఏ యుగంలోనయినా విశ్వాన్ని నడిపిస్తాయి.
ఇదే విషయం పై ఎస్పీ వెంకటరత్నం నిన్న ఈసీకి కూడా లేఖ రాసారు. వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై భారత ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని... శ్రీకాకుళం నుంచి బదిలీ అయిన ఎస్పీ అడ్డాల వెంకటరత్నం ప్రకటించారు. విచారణలో తాను తప్పు చేసినట్లు తేలితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, లేనిపక్షంలో తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విన్నవిస్తూ లేఖ రాశారు.
విజయసాయిరెడ్డి ఫిర్యాదులోని ఆరోపణల ఆధారంగా తనను బదిలీ చేస్తూ ఎంత వేగంగా చర్యలు తీసుకున్నారో... అంతే వేగంగా తాను తప్పు చేశానో లేదో తేల్చాలని లేఖలో వెంకటరత్నం కోరారు. తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై ఐపీసీ సెక్షన్ 182 కింద కేసు పెట్టాలని ఫిర్యాదు ఇవ్వటంతో పాటు, సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘ముప్పై ఏళ్లుగా నిజాయతీతో బతుకుతున్నా.. ఇప్పుడు ఒక్కసారిగా నా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు పరువు పోయింది.. నాపై ఆరోపణలు నిరూపించాలి లేదా నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారి (విజయసాయిరెడ్డి)పై చర్యలు తీసుకోవాలి’ అని ఐపీఎస్ అధికారి వెంకటరత్నం అన్నారు.