మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో పర్యటిస్తూ, ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు... అయతే, ఈ మూడు రోజుల నుంచి, నన్ను ఎవరో కొట్టేస్తున్నారు, నా మీదకు రౌడీలు వచ్చారు, గుడ్డలు ఊడదీసి కొడతాను, ఇలా ఎదేదో మాట్లాడుతూ, ఎందుకో తెగ ఇబ్బంది పడుతున్నారు... ఇంకా కామెడీ ఏంటి అంటే, మా బౌన్సర్ లను కొట్టారు, వారి బదులు కొత్త బౌన్సర్ లు రావాలి అందుకే, ఈ రోజు సెలవు అని చెప్పారు... కాని మనం టీవీల్లో, పేపర్ లో చూసింది, బౌన్సర్ లే అక్కడకు వచ్చిన వారిని ఇరగ బాదారు.. ఇంతే కాదు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, నన్ను చంపేస్తే చంద్రబాబుదే బాధ్యత అంటూ, పవన్ తీవ్రమైన ఆరోపణలు చేసారు... నిజానికి పవన్ కు వ్యక్తిగత బధ్రత ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది.. ఇక్కడ కూడా ఎదో ఊహించుకుని, పవనే వాళ్ళను వెనక్కు పంపించారు.. ఇప్పుడేమో ఇలా.. కాని వాస్తవానికి, శ్రీకాకుళం పోలీసులు పవన్ సభలకు, రోడ్ షో లకు పూర్తి బధ్రత ఇచ్చారు...

pk 24052018 2

పవన్ కళ్యాణ్ మాత్రం, అవాస్తవాలు చెప్తూ, దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటానికి చూస్తున్నాడు.. దీని పై శ్రీకాకుళం ఎస్పీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు... "జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారి తరుపున... జనసేన ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా జనసేన పార్టీ నుండి జిల్లా యస్.పి. గారికి వచ్చిన అభ్యర్ధన మేరకు తక్షణమే స్పందించి, జిల్లాలో గల మూడు సబ్-డివిజనల్ పోలీసు అధికారులకు సెక్యూరిటీ పరంగా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా జిల్లా తరుపు నుండి (i) పి.యస్.ఓస్, (i) రోప్ పార్టీస్, (i) మల్టీ కాంపోనెంట్, (iv) ట్రాఫిక్ కాంపోనెంట్, (v) లా & ఆర్డర్ కాంపోనెంట్ మరియు పవన్ కళ్యాణ్ గారు బస చేసిన విడిది వద్ద తగిన బందోబస్తీ ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తీ విషయంలో ఎక్కడా రాజీ లేదని, బౌన్సర్ల పై దాడి చేసినట్లు, దెబ్బలు తగిలినట్లు పోలీసు వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని జిల్లా యస్.పి. గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేసినారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీకాకుళం."

pk 24052018 3

ఇదే విషయం పై డీజీపీ మాలకొండయ్య కూడా స్పందించారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ భద్రతపై ఎలాంటి అయోమయం లేదని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. గురువారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక నేతలు జిల్లాల ఎస్పీలతో మాట్లాడితే భద్రతా చర్యలు తీసుకుంటారని, ఇందులో ఎటువంటి అయోమయాలకు తావులేదన్నారు. ఒక పక్క పోలీసులు అధికారులు రాత పూర్వకంగా చెప్తున్నా, మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయనకే తెలియాలి.. ఇలా చెప్తే కాని, ప్రజల్లో సానుభూతి రాదేమో అని, కొత్త సలహాదారుడు చింతలబస్తీ దేవ్ ఏమన్నా చెప్పాడేమో కాని, ఇంత చేస్తున్నా పోలీసులుల మీద నిందలు వేసి, పబ్బం గడుపుకోవటం మాత్రం తప్పు. మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పే పవన్, ఇలా పోలీసుల పై అవాస్తవాలు చెప్పకూడదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read