శ్రీకాకుళం జిల్లా పలాసమున్సిపాలిటీలో టీడీపీకిచెందిన నలుగురు కౌన్సిలర్లను, అత్యంతహేయంగా, నీచాతినీచంగా వైసీపీవారు తమ అభ్యర్థులని చెప్పి వారిని అధికారపార్టీలో చేర్చుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 4 వవార్డుకి చెందిన వావిళ్లపల్లి శ్రీనివాసరావు, 8వ వార్డుకి చెందిన రోణంకి మురళీకృష్ణ, 20వవార్డుసభ్యుడైన బమ్మిడి వెంకటలక్ష్మి, 29వవార్డుకి చెందిన సనపాలహరిలు గతమార్చిలోనే టీడీపీతరుపున నామినేషన్లు వేశారన్నారు. టీడీపీవారికి బీఫామ్ లుకూడా ఇచ్చిందన్నారు. పలాసమున్సిపాలిటీ టీడీపీ వశమయ్యే అవకాశాలు మెండుగాఉన్నాయన్న టీడీపీనేత, టీడీపీనుంచి వైసీపీలో చేరిన అభ్యర్థులకు చెందిన నాలుగువార్డుల్లో కచ్చితంగా టీడీపీయే గెలుస్తుందన్నారు. ప్రత్యేకించి 20, 29వార్డుల్లో టీడీపీ గెలుపుతథ్యమని, మిగిలిన రెండువార్డుల్లో వైసీపీ గట్టిపోటీ ఇస్తుంది తప్ప, గెలవలేదన్నారు. మున్సిపాలిటీ టీడీపీకి దక్కుతుందని తెలిసే, అధికారపార్టీ ఈ విధంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహించిం దన్నారు. టీడీపీ తరుపున బీఫాములు తీసుకున్నవారికి వైసీపీ కండువాలు వేసినంతమాత్రాన వారు వైసీపీఅభ్యర్థులు అవుతారా అని అశోక్ బాబుప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలప్రకా రం, బీఫామ్ లు తీసుకొని నామినేషన్లు వేసినవారుచనిపోతేనే, వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందన్నారు. నిన్నటి నుంచి సదరునలుగురు అభ్యర్థులు కనిపించడంలేదని, దానిపై ఈరోజు ఉదయం అలజడి మొదలైందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వారు వైసీపీలో చేరినట్లు వార్తలొచ్చాయని వారికి ఏమిఆశచూపించి, ఎంతలాభయపెట్టి, అధికారపార్టీలో చేర్చుకున్నారో తెలియాల్సి ఉందన్నారు. పలాసమున్సిపాలిటీ ఓడి పోతే ఏమవుతుందని వైసీపీ ఇంతలా బరితెగించిందన్నారు. పంచా యతీ ఎన్నికల్లోకూడా టీడీపీ తరుపున గెలిచినఅభ్యర్థులకు అధికా రపార్టీ కండువాలు కప్పి, వారిని భయపెట్టారన్నారు.
ధైర్యం ఉంటే ఎన్నికల్లోపోటీ చేసిగెలవాలిగానీ,ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడ టం వైసీపీకి తగదన్నారు. టీడీపీ మద్ధతుదారులు ఓట్లువేయకుం డా, వైసీపీలోచేరినంతమాత్రాన సదరు నలుగురు అభ్యర్థులు ఎలా గెలుస్తారన్నారు. అభ్యర్థులు బంధువులు, వారిరక్తంపంచుకు పుట్టిన వారైనాసరే, సైకిల్ గుర్తుకు ఓటువేసేఎవడైనా సరే, ఫ్యాను గుర్తుకు వేయడన్నారు. అవసరమైతే నామినేషన్లు ముందు పార్టీ లుమార్చడం, గెలిచినవారిని భయపెట్టి పార్టీలోకి తీసుకోవడం వంటి చర్యలతోనే అధికారపార్టీ స్థానికఎన్నికల్లో గెలుపును సాధ్యం చేసుకుంటోందన్నారు. పలాస వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిష న్ దృష్టికి తీసుకెళ్లినట్లు, అశోక్ బాబు తెలిపారు. నామినేషన్ పత్రాల్లో టీడీపీతరుపున పోటీచేస్తున్నట్లు సదరుఅభ్యర్థులు ఇప్పటి కే ప్రకటించారని, వారురేపు ప్రచారంలో సైకిల్ పై తిరుగుతూ, వైసీపీ కండువాలు కప్పుకొని ప్రచారంచేస్తారా అని టీడీపీనేత ఎద్దేవాచేశా రు. ఈ విధంగా చేయడం వైసీపీకే చెల్లిందన్న అశోక్ బాబు, గుర్తుపై జరిగే ఎన్నికల్లో ప్రజలను మోసగించడం అధికారపార్టీవల్ల కాదన్నా రు. వైసీపీ దిగజారుడుతనం గురించి చెప్పడానికి మాటలుకూడా సరిపోవడంలేదన్నారు. ప్రజలకు తామేంచేశామో చెప్పుకొని, గెలిచే స్థితిలో వైసీపీలేనందునే, ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంద న్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో ఇటువంటి ఘటనలు జరిగేవని, కానీ నేడు వైసీపీప్రభుత్వంలో కొత్తగా చేస్తున్న, సరికొత్త ఘటనలను నేర్చుకోవడానికి ఆయారాష్ట్రాలవారే ఇక్కడకు వచ్చే ప రిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్ఈసీ తక్షణమే పలాస వ్యవహారంపై స్పందించి, వైసీపీలో చేరిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తక్ష ణమే రద్దుచేయాలని కోరబోతున్నాము. ఎస్ఈసీ జోక్యం చేసుకోక పోతే, ఈవ్యవహారం పలాసతో ఆగదన్నారు. నామినేషన్ ఫామ్ లో టీడీపీ తరుపున పోటీచేస్తాననిచెప్పినవారు, వైసీపీలో చేరితో, ఆ ఫామ్ కి ఉన్నచట్టబద్ధత ఏముంటుందన్నారు. వైసీపీ కండువాలు కప్పుకొని టీడీపీపై పోటీచేయడాన్ని తక్షణమే ఎస్ఈసీ నిలువరిం చాలన్నారు. ఇదేప్రహాసనం కొనసాగితే, అంతిమంగా ఓటర్ ఓడిపోతాడన్నారు.