ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈ రోజు హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరిగింది. అయితే డిశ్చార్జ్ పిటిషన్ పై, తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలి అంటూ, శ్రీలక్ష్మి తరుపు న్యాయవాది సిబిఐ కోర్టుని కోరారు. దీనికి స్పందించిన సిబిఐ కోర్టు, వాదనలు వినిపించేందుకు, నేటి విచారణే చివరి వాయిదా కదా అని గుర్తు చేసి, న్యాయవాదికి షాక్ ఇచ్చింది. దీనికి స్పందించిన న్యాయవాది, తాము ఇప్పటికే హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేసామని, అది జూలై 2వ తేదీకి వాయిదా పడిందని, అందుకే సమయం కావాలి అంటూ, శ్రీలక్ష్మి తరుపు న్యాయవాది సిబిఐ కోర్టుని కోరారు. అయితే ఇప్పటి వరకు హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి, తాము ఎలాంటి గడువు ఇంకా ఇవ్వలేమని సిబిఐ కోర్టు తేల్చి చెప్పింది. వెయ్యి రూపాయాలు జరిమైనా చెల్లిస్తే వాదనలు వింటాం అంటూ, సిబిఐ కోర్టు మరో షాక్ ఇచ్చింది. మొత్తం మీద ఈ కేసుని జూలై 5కు వాయిదా వేసిన సిబిఐ కోర్టు, ఆ రోజు కనుక వాదనలు వినిపించకాపోతే, మేమే తగిన ఉత్తర్వులు ఇస్తాం అంటూ, సిబిఐ కోర్ట్ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓబుళాపురం గనుల కేసు విచారణ జరుగుతున్న సందర్బంలో, ఈ కేసులో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పై కూడా సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆమె పాత్ర పై కూడా సిబిఐ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
ఇక మరో పక్క సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఒక కేసుగా ఉన్నా పెన్నా ఛార్జ్‌షీట్‌పై కూడా ఈ రోజు విచారణ జరిగింది. ఈ రోజు విచారణలో గనులశాఖ మాజీ అధికారి రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. పెన్నా కేసు నుంచి రాజగోపాల్‌ను తొలగించవద్దని సీబీఐ కోర్టును కోరింది. మరో అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సమయం కావాలని కోర్టుని సిబిఐ కోరింది. ఇక సాంకేతిక కారణాలతో పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్ సిబిఐ కోర్టు వెనక్కు ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ పై విచారణ జులై 6కు వాయిదా వేసింది సిబిఐ కోర్టు. అయితే ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో ట్రైల్స్ స్టార్ట్ కాకపోవటం పై పలువురు పెదవి విరుస్తున్నారు. డిశ్చార్జ్ పిటీషన్ల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసులు అన్నీ ఏడాది లోపు పూర్తి కావాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.