అప్పటి వరకు ఆమె ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్... చిన్న తనంలోనే, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాని ఆమె కెరీర్ పై వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండగా చేసిన పనులకు, మచ్చ పడింది. ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆమె శ్రీలక్ష్మి. దయనీయ స్థితిలో, నడవలేని పరిస్థితిలో, ఆమె జైలు జీవితం కూడా అనుభవించారు. ఇదంతా ఓబులాపురం గనులు గాలి అండ్ గ్యాంగ్ కొట్టేసిన కేసులో, ఆమె కీలక అధికారిగా ఉండి, అనుమతులు ఇవ్వటమే కారణం. తరువాత, ఆమె అరెస్ట్ అవ్వటం జైలుకు వెళ్ళటం అన్నీ చూసాం. అయితే అప్పట్లో అందరూ ఆమె పై జాలి పడ్డారు. పాపం రాజకీయ ఒత్తిడులకు ఈమె బలయ్యారని అందరూ బాధపడ్డారు. ఆమె తరువాత జైలు నుంచి బయటకు రావటం, మళ్ళీ విధుల్లో చేరటం అన్నీ జరిగిపోయాయి.

srilakshmi 23072019 2

ప్రస్తుతం ఆమె తెలంగాణాలో పని చేస్తున్నారు. అయితే ఎవరి వల్ల ఆమె కష్టాలు పడ్డారని ప్రజలు భావించారో, వారితోనే మళ్ళీ పని చేస్తాను అని ఆమె చెప్పటం, ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. అన్యాయంగా వాళ్ళు చేసిన తప్పుకు, ఈమె బలయ్యారని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, నేను తెలంగాణా నుంచి డెప్యుటేషన్ పై వచ్చి, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఆధ్వర్యంలో పని చేస్తానని ఆమె కోరారు. అయితే, ఆమె ఆంధ్రప్రదేశ్ రావాలి అనుకోవటం, జగన్ కూడా ఓకె అనటం జరిగిపోయాయి. అయితే, అనూహ్యంగా ఈ డెప్యుటేషన్లకు కేంద్రం అడ్డు పడుతుంది. ఏపి ఇంటలిజెన్స్ అధికారిగా, తెలంగాణా అధికారి స్టీఫెన్ రవీంద్రను పెట్టుకుంటామని అడగ్గా, దానికి కూడా కేంద్రం ఒప్పుకోలేదు.

srilakshmi 23072019 3

అయితే మరి శ్రీలక్ష్మి పట్టుదల ఎందుకోసమో తెలియదు కాని, ఏపిలో పని చెయ్యటానికి ఆమె కంకనం కట్టుకున్నారు. అందుకే ఈ రోజు విజయసాయి రెడ్డితో కలిసి పార్లమెంట్లో ప్రత్యక్షం అయ్యారు. అక్కడ హోం మంత్రి అమిత్ షా కార్యాలయానికి వెళ్లి దాదాపుగా అరగంట పాటు వేచి చూసారు. తరువాత అమిత్ షా రావటంతో, ఆయనతో 15 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అక్కడ నుంచి, మళ్ళీ ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానిని కలిసారో లేదో క్లారిటీ లేదు. మరి అమిత్ షా , ప్రధాని కార్యాలయం నుంచి, విజయసాయి రెడ్డికి, శ్రీలక్ష్మికి ఎలాంటి హామీ లాబించిందో కాని, ప్రజలు మాత్రం, ఇవన్నీ చూస్తూ, ఎవరు ఏంటో ఆర్ధం కావటం లేదని అంటున్నారు. శ్రీలక్ష్మి, రాజకీయ బాధితురాలు అనుకుని జాలి పడ్డాం, కాని ఆమె ఎవరి వల్ల అయితే జైలుకు వెళ్లిందో, మళ్ళీ వారితోనే పని చెయ్యాలి అనుకోవటం ఏంటో అర్ధం కావటం లేదని ప్రజలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read