మూడేళ్ల నుంచి వరదన్నదేలేక, గేట్ల కంటే కిందికి పడిపోయి... అట్టడుగు స్థాయికి చేరుకున్న నీటి మట్టంతో వెలవెలపోయిన శ్రీశైలం జలాశయం! ఇప్పుడు, ఇన్నాళ్లకు... మళ్లీ నీళ్లతో తుళ్లి పడనుంది. ఎగువనున్న ప్రాజెక్టుల ‘అడ్డుగోడల’ను దాటి బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది...

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం ఉదయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఒక్కొ గేటును 10 అడుగుల మేర ఎత్తారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 884.80 అడుగులతో 214.8450 టీఎంసీలుగా ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,878 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read