ఎన్నికల ఫలితాలు రావటం మొదలు, ఇప్పటి వరకు, ఈ 45 రోజుల్లో, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కారాడుతుంది. ఇప్పటి వరకు 150 దాడులు చేసి, 6 గురిని చంపేశారు. హోం మంత్రి గారేమో, అందరికీ భద్రత ఇవ్వలేం, ఏదైనా జరిగిన తరువాత ఇస్తే, విచారణ చేసి శిక్షిస్టాం అంటున్నారు. ఇక ఇదే అదనుగా చూసుకుని, ఆపేవాళ్ళు లేకపోవటంతో వైసీపీ రెచ్చిపోతుంది. రోజు రొజుకీ ఇలాంటి దాడులు తగ్గాల్సింది పోయి, పెరుగుతున్నాయి. నిన్నటి వరకు కార్యకర్తలు, కింద స్థాయి నేతల వరుకే టార్గెట్ చేసిన వైసీపీ, ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసింది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ పై వైసీపీ దాడికి ప్రయత్నించింది. పలాసపురంలోని అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వచ్చారు. అయితే, ఆయన ప్రారంభోత్సవం చెయ్యకూడదు అంటూ వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే పైనే దాడికి ప్రయత్నించారు
వైసీపీ చేసిన ఈ దాడి పై ఎమ్మెల్యే అశోక్, వైసీపీ నేతల పై సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు పోలీసుల వైఖరికి నిరసనగా, పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసనకు దిగారు. అయితే కొద్ది సేపటికి వివాదం సద్దుమణిగింది. ఈ దాడి పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, కిమిడి కళా వెంకట్రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ ప్లాన్ చేస్తోంద,ని నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై వైసీపీ నేతల దౌర్జన్యం అది రుజువు చేస్తోందని అన్నారు. ఏకంగా శాసనసభ సభ్యుడిపైనే దాడికి యత్నించడం ఆందోళన కలిగించే అంశం అని అన్నారు. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కార్యకర్తలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు, ఇప్పుడు మరింత బరితెగించి ఎమ్మెల్యేపై దాడి చేయాలనుకోవడం, అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం గర్హణీయం అని అన్నారు. డీజీపీ ఇప్పటికైనా ఇలాంటి దాడులు అరికట్టాలని అన్నారు.