శ్రీశైలం ప్రాజెక్ట్ లెఫ్ట్ పవర్ హౌస్ లో, భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు, ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. గత 15 రోజులుగా వర్షాలు కురవటం, ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా వరదల కారణంగా , భారీగా శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీరు వచ్చి చేరింది. ఈ నేపధ్యంలో, నిన్నటి నుంచి గేటులు కూడా తెరిచారు. అలాగే లెఫ్ట్ పవర్ హౌస్ లో, గత 20 రోజులుగా భారీగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉండటంతో, ఒంటిగంట ప్రాంతంలో, అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడుతో ఒక్కారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో, అందరు భయాందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు అయ్యారు. వెంటనే అక్కడకు అధికారులు చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసారు. అయితే వెంటనే విద్యుత్తు ఆపేయటంతో, మంటలు ఆగినా, మొత్తం పొగ అలుముకుంది. అయితే ఈ ప్రమాదంలో, మొత్తం 9 మంది ఇరుక్కున్నారని తెలుస్తుంది. లోపల చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు, రేస్క్యు టీం ప్రయత్నం చేస్తున్నా, లోపలకు వెళ్ళటానికి వీలు పడటం లేదు..

sirsaliam 21082020 2

దీంతో ఇప్పటి వరకు ఆ 9 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ 9 మందిలో 7 గురు జెన్కో ఉద్యోగులు కాగా, ఇద్దరు అమర్ రాజా బ్యాటరీస్ సర్వీస్ చేసే ఉద్యోగులు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ పవర్ ప్లాంట్ భూగర్బ అండర్ టన్నల్ లో ఈ ప్లాంట్ ఉంటుంది. ముందుగా ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు వచ్చాయి. నాలుగు జెనరేటర్లకు సంబందించిన ప్యానెల్స్ అన్నీ పూర్తిగా మంటకు దగ్ధం అయ్యి, గ్రౌండ్ ఫ్లోర్ లోకి కూడా వ్యాపించాయి. భారీ మంటలు క్షణాల్లో వ్యాపించాయి. లోపల ఉన్న సిబ్బంది మంటలు అర్పటానికి ప్రయత్నం చేసినా వారికి వీలు కాలేదు. కొంత మంది బయటకు వచ్చినా, 9 మంది ఇరుక్కుపోయారు. బయటకు వచ్చిన వారు వెంటనే విద్యుత్ ఆపేసారు. దీంతో ఈ ప్లాంట్ భూగర్భంలో ఉండటంతో, మొత్తం చీకట్లు అలుముకున్నాయి. పొగ చీకట్లు ఉండటం వల్ల, లోపల ఉన్న వారు ఎటు వైపు రావాలో అర్ధం కాక చిక్కుకుపోయారు. బయటకు వచ్చిన వాళ్ళు, లోపల ఉన్న వారికి ఫోన్ చేసి, ఎలా బయటకు రావాలో చెప్పినా, చీకటి ఉండటంతో, వారు బయటకు రాలేక పోయారు. ఒక గంట తరువాత, ఫోన్ కనెక్ట్ కాక పోవటంతో, అందోళన నెలకొంది. ప్రస్తుతం, రేస్క్యు ఆపరేషన్ కొనసాగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read