కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 (నీట్)ను వాయిదా వేయాల్సిందేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు సైతం ఈ డిమాండును సమర్థిస్తున్నాయి. అయినప్పటికీ ఏమీ పట్టనట్లుగా జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి జూలైలోనే జరగాల్సిన ఈ పరీక్షలు క-రో-నా కారణంగా వాయిదా పడ్డాయి. వీటిని సెప్టెంబరులో నిర్వహిస్తామని కేంద్రం అనంతరం వెల్లడించింది. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని 11 రాష్ట్రాల విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్షల్లో జాప్యం వద్దని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పరీక్షల షెడ్యూల్ ను కేంద్రం విడుదల చేసింది. ఓవైపు క-రో-నా మహమ్మారి మరోవైపు భారీ వర్షాలు, వరదలు.. ఇలాంటి పరిస్థితుల్లో తాము పరీక్షలకు హాజరయ్యేది ఎలా అంటూ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ని-ర-స-న-లు చేపడుతున్నారు. నల్ల బ్యాండ్లు ధరించి నిరాహార దీక్షలు చేస్తున్నారు. 

stalin 28082020 2

సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. క-రో-నా ముప్పుతో పాటు బీహార్, గుజరాత్, అసోం, కేరళ తదితర రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ లో ఇంటర్నెట్ పై ఆం-క్ష-లు ఉన్నాయి. ప్రజా రవాణా స్తంభించడంతో విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం కష్టతరం కానుంది. వీటన్నింటి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక మరో పక్క రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పై స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలని ఏకం చేస్తుంది. బీజేపీ లేని రాష్ట్రాల్లో మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో, డీఎంకే అధినేత స్టాలిన్ రంగంలోకి దిగి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు పలకాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ కోరారు. తాము ఈ విషయం పై మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తున్నామని, అందరూ దీనికి మద్దతు ఇచ్చి, కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. మరో మోడీని ఏదైనా అనాలి అంటే ఆలోచించే, ఈ ఇద్దరు కేంద్రాన్ని నిలదీస్తారో లేదో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read