మన ప్రతిపక్షం, మిత్రపక్షం కూడా చంద్రబాబుని అకరానంగా విమర్శిస్తుంటే, మగిలిన రాష్ట్రాల్లో మాత్రం, చంద్రబాబు విధానాలకు ఫిదా అవుతున్నారు... ఇప్పటికే పవర్ సెక్టార్ లో ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శం అయ్యారని ఇప్పటికే వివిధ రాష్ట్రాలు చెప్పాయి... మొన్న గవర్నర్ కిరణ్ బేడీ కూడా 1100ని అభినందించారు... ఇలా చాలా మంది వివిధ సందర్భాల్లో చంద్రబాబు విధానాలని మెచ్చుకున్నారు... ఇప్పుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని అభినందిస్తూ ట్వీట్ చేశారు...
సమాజంలో హిజ్రాలకు ఎదురవ్వుతున్న చిన్నచూపుని గుర్తించి, హిజ్రా వెల్ఫేర్ బోర్డును స్థాపించి వారి సంక్షేమంకోసం కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు... హిజ్రాలకు వెయ్యి రూపాయలు పెన్షన్ రేషన్ పంపిణీతో పాటు, ఇల్లు కూడా కట్టించే ప్రతిపాదనలో ఉన్నామని అన్నారు.. వాళ్లకు కావాల్సిన అన్ని పథకాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.. ఈ విషయం ప్రస్తావిస్తూ తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్వీట్ చేశారు... మా తలైవార్ నాయకుడు కరుణానిధి, మా పార్టీ హిజ్రాల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, వారికి పెన్షన్ పధకం పెట్టినందుకు చంద్రబాబుకి అభినందనలు అని, తమిళనాడు ప్రభుత్వం కూడా, చంద్రబాబు చేసినట్టు చెయ్యాలి అని, వారిని ఆదుకోవాలని ట్వీట్ లో రాశారు..
సమాజంలో మూడవ తరగతి ప్రజలుగా బ్రతుకు పోరాటంలో హిజ్రాలు ఎదుర్కొనే సమస్యలు అనేకం. సామాజికంగా.. రాజకీయంగా.. ఏవిధంగా చూసుకున్నా.. ఎందులోను వారికి తగిన ప్రాధాన్యం లేదు. కనీస తిండికి, బట్టకు నోచుకోని స్థితిలో చాలామంది హిజ్రాలు అత్యంత ధీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇవన్నీ తన పాదయాత్రలో చుసిన చంద్రబాబు, అప్పుడే వీరికి హామీ ఇచ్చారు... ఇప్పుడు హామీ నెరవేర్చారు... ఇప్పటికే చంద్రబాబు చేసిన పనికి కృతజ్ఞతగా, చంద్రబాబు రూపం కలిగిన ఐదుకేజీల ఇత్తడితో సీఎం చంద్రబాబు నాయుడుకి గుడి కట్టనున్నట్లు సమతా హిజ్రా హక్కుల ఐక్య పోరాట వేదిక స్థాపకుడు విజయ కుమార్ తెలిపారు. ఈ గుడిని కర్నూల్ జిల్లా నంద్యాల్ టౌన్ హిజ్రా కాలనీ లో దాదాపు 10 లక్షల వ్యయంతో దీన్నినిర్మిస్తున్నారు.