పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్యులు అల్లాడి పోతున్నారు. పెట్రోల్, డీజిల్ రెండూ కూడా వంద మార్క్ కు చేరుకున్నాయి. ఒక పక్క కేంద్రం పన్నులు, మరో పక్క రాష్ట్రాల పన్నులతో, ప్రజలు ఉక్కిరిబిక్కిరియా అయిపోతున్నారు. పెట్రోల్ రెట్లు పెరిగితే, దాని ప్రభుత్వం అన్నిటి పై పడుతుంది. రవాణా చార్జీలు పెరుగుదలతో, బస్సు చార్జీలు పెరుగుతాయి, అలాగే నిత్యావసరధరలు పెరుగుతాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రజల కష్టాన్ని పెట్రోల్ పన్నుల రూపంలో పీల్చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో పన్నులు బాదుడు దక్షిణ భారత దేశంలోనే హైలైట్ అని చెప్పాలి. ఇక్కడ పన్నులు బాదుడుతో, దేశంలో మూడో స్థానంలో, దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్ గా ఏపి ఉంది. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత పన్నులు బాదుడు అధికం అయ్యింది. రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచారు. దీనికి తోడుగా, లీటర్ కు ఒక రూపాయి చొప్పున, రోడ్డు టాక్స్ పేరుతో బాదేస్తున్నారు. మరి రోడ్డులు బాగున్నాయా అంటే అదీ లేదు. ఇలా పన్నులు, సుంకాల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజల పై అధిక భారాన్నే మోపింది. ఎన్నికల ముందు బదుడే బాదుడు అంటూ ఊరు ఊరు తిరిగి సాగదీస్తూ చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు మాత్రం, పన్నులు పెంచేస్తూ, తనకు ఏమి తెలియదు అన్నట్టు కూర్చున్నారు.

petrol 13082021 21

ఇక ఇది ఇలా ఉంటే, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండగా, ప్రజల పై పన్నుల భారం ఎక్కువగా పడుతుందని, కేంద్రం భారీగా పన్నులు పెంచుతుందని, ప్రజల పై భారం పడకుండా, లీటర్ పెట్రోల్ పై రూ.2 తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా రెండు వేల కోట్లు ప్రజల పై భారం పడకుండా చూసారు. అప్పట్లో అన్ని రాష్ట్రాలు చంద్రబాబు లాగా చేయాలని కోరాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఫార్ములానే, ఫాలో అయ్యారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ప్రజల పై భారం పడకుండా, లీటర్ కు రూ.3 తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు తమిళనాడులో వందకు తక్కుగా పెట్రోల్ పడిపోయింది. ఇప్పటికే మన రాష్ట్రానికి, తమిళనాడు కూడా నాలుగు రూపాయల వరకు తేడా ఉంది, ఇప్పుడు దాదపుగా ఏడు నుంచి ఎనిమిది రూపాయలు తక్కువకు అక్కడ పెట్రోల్ లభించనుంది. అయితే స్టాలిన్ తీసుకున్నట్టే జగన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు అనే ప్రశ్న వస్తుంది. పధకాలు ఇవ్వటంలో నేనే గొప్ప అని చెప్పే జగన్, అందరికీ ఉపయోగపడే పెట్రోల్ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read