ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. నిన్న చెన్నై వెళ్లిన చంద్రబాబు... డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చెన్నైకి వచ్చి డీఎంకేకు మద్దతు ప్రకటించిన చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో డీఎంకే ముందు వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నా అని తెలిపారు.
అయితే తమిళనాడులో ఎన్నికల్లో త్రిముఖపోటీ నెలకొంది. అదికార, ప్రతిపక్షం మద్య పోటీ కాకుండా అదికార పార్ట కంటిలో నలుసులా పరిణమించాడు టీటీవి దినకరన్. తమిళనాడులో దినకరన్ తో పాటు కమలహాసన్ కూడా అదికారపార్టీకి శరాఘాతంగా మారిపోయారు. ఐతే ఉప ఎన్నికల్లో పోటీ లో ఉన్న 18 మంది అభ్మర్థుల్లో ఎవరు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే వారు అదికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి లోక్ సభ ఎన్నికల కన్నా శాసన సభ ఎన్నికలమీద నాయకులు ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రదచారం తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తుందనే చర్చ జరుగుతోంది.