రాష్ట్ర గవర్నర్ నరసింహన్ న మార్చాలంటూ కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ కు బీజేపీ రాప్త అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు లేఖ రాయడం ఆ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ రోజు కూడా పార్టీ పటిష్టతకు కానీ, కార్యకర్తల సంక్షేమానికి కానీ సమయం వెచ్చించని హరిబాబు ఉన్నట్టుండి గవర్నర్ అంశాన్ని తెరపైకి తేవడంలోని ఆంతర్యమేమిటని ఆ పార్టీలోని కొంత మంది నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా వీరంతా రాష్ట్ర ప్రభుత్వనికి, మరీ ముఖ్యంగా చంద్రబాబుకి వ్యతిరేకులు... కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేసే గవర్నర్ అంశంలో హరిబాబు వ్యవహరించిన తీరు పై వీరు మండిపడుతున్నారు...
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గవర్నర్ ఎలా వ్యవహిరుస్తున్నారో అందరికీ తెలుసు... ఆయన వైఖరిని తప్పపడుతూ హరిబాబు కేంద్ర హోంమంత్రికి ఇటీవల లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రంగా పాలన సాగుతున్నప్పటికీ గవర్నర్ హైదరాబాద్లో ఉంటూ పాలన సాగిస్తున్నారనేది ఆయన లేవనెత్తిన ప్రధాన అంశాల్లో ఒకటి. అంతకు ముందే నాలా చట్టం వెనక్కి పంపడం పై బీజేపీ పక్షనేత పి.విషుకుమార్రాజు కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పపట్టారు.
రాష్ట్ర పాలనాపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు నెలకొంటే ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చూసుకుంటారని, మీకు ఎందుకు అంత ఆనందం అని బీజేపీ లోని కొంత మంది నేతలు, ఈ ఇద్దరు నేతల పై ఫైర్ అవుతున్నారు. ఇప్పడు గవర్నర్ మార్ప ఆవశ్యకత పై హరిబాబు వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదనేది వీరి వాదన. తెలంగాణా కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి పై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా చూడాల్సిన నేతలే ఇందుకు విరుద్దంగా వ్యవహరించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.