"మూడెద్దులు ఉన్నవాడు ఎప్పుడు చెడిపోడు.... మంచి నోరు ఉన్నవాడెవ్వడు అభాసుపాలు కాడు" ఇప్పుడు ఈ సామెత ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల విషయంలో పూర్తిగా రివర్స్ అయింది... అధికార పక్షంతో స్నేహంగా ఉన్నాం, అధికారం అనుభవించవచ్చు అనుకున్న వారు కొందరు... పోనీ అలా కాకపోతే ఇలా అనుకుని చంద్రబాబు తమ మాట వినకపోతే తమ మాట వినే నాయకుల గురించి ఇక్కడివి అక్కడికి మొస్తే చంద్రబాబు మీద ఒత్తిడి తేవచ్చు అనుకుని హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేసి బోల్తా పడ్డారు.

మంచి నోరు మొదట్లో ఉన్నా వారి తత్వమో ఏమో తెలియదు గాని, అది పూర్తిగా మారి వారిని అభాసు పాలు చేసిందండంలో ఎలాంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అక్కడి నుంచి చంద్రబాబు మైలేజ్ తగ్గుతుందని ఒక పాట రాసి బిజెపి అగ్రనాయకత్వం ముందు ఆలపించారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు చంద్రబాబు గురించి తెలిసి కూడా వీరి మాటలు నమ్మిన బిజెపి అగ్ర నాయకత్వం చంద్రబాబు సామర్ధ్యానికే పరీక్ష పెట్టింది.

తీరా చూస్తే నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కాలికి ఎదురు దెబ్బ తగిలినట్టు ఇక్కడి వారు అక్కడి వారు బాధ పడ్డారు.. అప్పటి నుంచి అధికార పార్టీ మీద విమర్శలు చేసిన కొందరు రాష్ట్ర స్థాయి నాయకులు అయితే వచ్చే ఎన్నికలకు పార్టీ జెండాలు కుట్టే పనిలో బిజీగా ఉండగా, మరికొందరు అయితే తెలుగుదేశం నాయకులను చూసి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నారట... ఏది ఎలా ఉన్నా చంద్రబాబు దెబ్బ మాత్రం వారికి గట్టిగానే తగిలిందని స్పష్టంగా అర్ధమైంది... చంద్రబాబు వద్దని బిజెపి నేతల వద్ద ఫ్లకార్డులు చూపించిన వారు మరి ఏమంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read