supreme 09122017 1

పోలరవం రగడ సద్దుమనుగుతూ ఉండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం పై మరో యుద్ధానికి సిద్ధమవుతుంది... కేంద్రం పై సుప్రీం కోర్ట్ లో ఏకంగా ధిక్కార పిటిషన్‌ వెయ్యటానికి సిద్ధమైంది... ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చెయ్యనున్నారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల ఆస్తులు, నగదు, సిబ్బంది పంపిణీకి సంబంధించి 2016 మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వుల పై దేశ సుప్రీం కోర్ట్ లో ధిక్కరణ పిటిషన్‌ వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

supreme 09122017 2

జనాభా ప్రాతిపదికన ఉమ్మడి ఆస్తులను, నగదును, ఉద్యోగులను పంచుకోవాలని 2016 మార్చి 18న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందుకు పూర్తి విరుద్ధంగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వుఇచ్చింది. ఆస్తుల పంపిణీ వివాదంపై రాష్ట్రప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్లు తగిన రీతిలో లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో వాటిని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. తదుపరి చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయించింది. dfరెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన, సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించుకునే విషయంలో, ధిక్కరణ పిటిషన్‌ ఎలా ఉండాలన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

supreme 09122017 3

కేంద్రంపై సుప్రీంలో ధిక్కార పిటిషన్‌ వేయాలా.. లేక హైకోర్టులో సవాల్‌ చేయాలా అన్న విషయమై ఉన్నతాధికారులు లోతుగా చర్చించారు. తుదకు ధిక్కరణ పిటిషన్‌ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా అమలైతే.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో పాటు పదో షెడ్యూల్‌ లోని సంస్థలకు సంబంధించి ఆస్తులు, నగదు రూపేణా దాదాపు రూ.30 వేల కోట్ల మేర రాష్ట్రానికి సమకూరాల్సిన పరిస్థితి....

Advertisements

Advertisements

Latest Articles

Most Read