రాష్ట్రాల హక్కులపై మరో దాడికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. రాష్ట్రాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న సహజవాయువును జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. త్వరలో జరగనున్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించాలని నిర్ణయించింది. జిఎస్టి కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి ధీరజ్ రస్తోగి ఈ విషయాన్ని ధృవీకరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక వర్క్ షాపులో మాట్లాడుతూ ఆయన 'జిఎస్టి పరిధిలోకి సహజవాయువును ప్రయోగాత్మకంగా తీసుకురావాలని భావిస్తున్నాం. విమాన ఇంధనాన్ని కూడా భవిష్యత్లో జిఎస్టిలోకి తెచ్చే అవకాశం ఉంది' అని చెప్పారు. ఈ నిర్ణయంతో జిఎస్టి బిల్లు ఆమోదం కోసం పెట్రో ఉత్పత్తులతో పాటు, మద్యం విక్రయాలను జిఎస్టి పరిధిలోకి తీసుకురామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మాటను తప్పినట్టైంది.
కేంద్ర సర్కారు ఈ తీరుపట్ల పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, రాష్ట్రా లకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇటువంటి ప్రకటన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో సహజవాయువు ద్వారా రాష్ట్ర ఖజానాకు 523 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ మొత్తాన్ని నష్టపోవాల్సివస్తుంది. అసలే ఆర్థిక కష్టాలతో సతమతమౌతున్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారనుంది. యనమల రామకృష్డుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సహజవాయువులను కూడా జిఎస్టిలోకి చేర్చడం సరికాదని వ్యాఖ్యానిరచారు.
వివిధ అరశాలపై పత్రికా ప్రకటనలు జారీ చేయడానికి మురదుగా జిఎస్టి కోసం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం అనుమతి తీసుకోవాల్సి ఉరటురదని ఆయనగుర్తు చేశారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి బేసిన్లోనున్న సహజవాయు నిక్షేపాల ద్వారా రాష్ట్రానికి కొరత రాయల్టీ నిధుల ఆదాయం లభిస్తోరది. తాజా నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉరదన్నారు. 'పెట్రో ఉత్పత్తులు చాలా కీలకమైనవి. కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలకూ వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అయితే, సహజవాయువు చాలా భిన్నమైన అంశం.దీనిని జిఎస్టి పరిధిలోకి రావడానికి దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది. అందువల్ల జిఎస్టిలోకి వచ్చే పెట్రో ఉత్పత్తుల్లో ఇది మొట్టమొదటిదైంది. భవిష్యత్లో ఈ జాబితా మరింత పెరగవచ్చు' అని జిఎస్టి కౌన్సిల్ కార్యదర్శి ధీరజ్ రస్తోగి అన్నారు.