రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషమై రెండు బిల్లులు తీసుకు వస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై దాఖలైన 55 పిటిషన్లు సంయుక్తంగా గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే ఈ గెజిట్ నోటిఫికేషన్ పై ఇచ్చిన స్టేటస్ కో గడువు గురువారంతో ముగియబోతున్న సమయంలో, హైకోర్టు ఏమి చెప్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో, ఈ సారి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా వచ్చే నెల 21 వరకు స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇక వచ్చే నెల దాకా, ప్రభుత్వానికి ఏమి చెయ్యటానికి ఉండదు. అలాగే అందరినీ అఫిడవిట్లు కూడా దాఖలు చెయ్యమని, ప్రభుత్వాన్ని కూడా ఏదైనా స్పెషల్ పిటీషన లో, అఫిడవిట్ వెయ్యాలి అంటే, వెయ్యమని ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణ గురించి విధివిధానాలు రూపొందించే అవకాసం ఉందని తెలుస్తుంది. ఇక మరో వైపు, వైజాగ్ లో 30 ఎకరాల్లో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ పై, కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద, ఢిల్లీ లాయర్ మూవ్ చేసారు. ఒక పక్క స్టేటస్ కో ఉన్నా, కోర్టు ఆదేశాలు ధిక్కరించి, గెస్ట్ హౌస్ పేరుతొ భారీగా 30 ఎకరాల్లో సచివాలయం కోసమే నిర్మాణాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని, అది విశాఖ కార్పొరేషన్ నిర్మిస్తుందని చెప్పారు.

court 27082020 2

అయితే రాష్ట్రపతి గెస్ట్ హౌస్ 5 ఎకరాల్లో ఉంటే, ఇక్కడ 30 ఎకరాల్లో గెస్ట్ హౌస్ ఏమిటి అంటూ, పిటీషనర్ తరుపు వాదించారు. దీని పై హైకోర్టు ఒకింత సీరియస్ గా తీసుకుని, దీని పై ప్రభుత్వం వెంటనే అఫిడవిట్ వెయ్యాలని, ఈ అఫిడవిట్ చీఫ్ సెక్రటరీ వెయ్యాలని చెప్పటంతో, హైకోర్టు ఈ విషయం సీరియస్ గా తీసుకుందని అర్ధం అవుతుంది. మరోవైపు నిన్న సుప్రీం కోర్టులో ఈ అంశంపై జరిగిన విచారణ సంద ర్భంగా హైకోర్టులోనే తేల్చుకోవాలని, కేసు అక్కడ విచారణలో ఉండగా.. తమ జోక్యం సరికాదనిసర్వోన్నత ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈ సారి, వచ్చే నెల 21 దాకా వాయిదా వెయ్యటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే రెండుసార్లు స్టేటస్ కోను విధించింది. దీంతో ఈ రోజు విచారణలో కూడా స్టేటస్ కోను పొడిగిస్తూ, ఈ సారి ఏకంగా వచ్చే నెల 21 వరకు వాయిదా వేసింది. అయితే గత రెండు వాయిదాలలో స్టేటస్ కోను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం తరుపు న్యాయవాది, ఈ సారి అలాంటి వాదన చెయ్యలేదని తెలుస్తుంది. ఒకసారి స్టేటస్ కో ఇస్తే, చివరి వాదన వరకు, ఇలాగే కొనసాగవచ్చనే అభిప్రాయంతోనే, ఇలా చేసి ఉండవచ్చు అని తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read