జగన్ మోహన్ రెడ్డి చేసిన అక్రమాలకు గాను, ఇప్పటికే 11 సిబిఐ కేసుల్లో A1గా, 5 ఈడీ కేసుల్లో A1గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి గాను ఇప్పటికే 16 నెలలు జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. ప్రతి శుక్రవారం కోర్ట్ కి కూడా వెళ్తున్నాడు. అయితే, జగన్ మీద అనేక కేసులు ఉన్నా, చాలా కేసుల పై స్టే ఉంది. దాదపు 8 కేసుల పై స్టే ఉంది. అయితే తాజగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో, ఈ స్టే నిన్నటితో అయిపొయింది. దీంతో నిన్న సిబిఐ కోర్ట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. స్టే పొడిగించుకోక పొతే, అన్ని కేసుల పై విచారణ మొదలు పెడతామని, దీని పై అక్టోబర్ 5 న నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. అన్ని కేసుల పై విచారణ మొదలు పెడితే, ఇక జగన్ వారానికి 2-3 రోజులు కోర్ట్ లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

court 29092018

జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. జగన్ కేసులే కాదు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓఎంసీ కేసుల్లోనూ కోర్టు విచారణ వేగం పుంజుకుంటుందని సమాచారం. జగన్‌ కేసుల్లో పలువురు నిందితులు సీబీఐ కోర్టు విచారణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే క్రిమినల్‌ కేసులో కింది కోర్టుల్లో విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఆరు నెలలు దాటితే.. ఆయా కేసుల్లో తాజాగా స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు లేకపోతే ఆ కేసుల విచారణ ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్‌, ఎమ్మార్‌, ఓఎంసీ కేసులకు సంబంధించి ఆ 6 నెలల గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిందితులు తాజాగా హైకోర్టు నుంచి స్టే పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకుంటేనే విచారణ నిలిపివేస్తామని.. లేదంటే విచారణను కొనసాగిస్తామని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది.

court 29092018

తదుపరి విచారణలోగా స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయకపోతే.. సీబీఐ కోర్టులో విచారణ ముందుకు సాగనుంది. ఇంకోవైపు.. అక్రమాస్తుల కేసుల్లో శుక్రవారం కోర్టులో జగన్‌, పలువురు నిందితులు హాజరయ్యారు. తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదాపడింది. అయితే ఈ విషయం పై జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. పాదయాత్రకు రాత్రే తిరిగి రావాల్సి ఉన్నా, లాయర్లతో రాత్రి అంతా చర్చలు జరిపి, ఉదయమే తిరిగి వచ్చారు. ఈ విషయం పై ఇక హై కోర్ట్ లో స్టే తెచ్చుకోవటం కష్టమని లాయర్లు చెప్పటంతో, జగన్ తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారు. ఇదే విషయం పై సమాలోచనలకు, విజయసాయి రెడ్డిని ఢిల్లీ వెళ్లి, ఎదో ఒకటి చెయ్యాలని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read