స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు లాగ్ బుక్ లో ఆ--త్మ--హ--త్య చేసుకుంటున్నట్టు రాసి అదృశ్యమవ్వడంతో మిస్సింగ్ కేసు పెట్టామని ఏసీపీ పెంటారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. అతను ట్రేస్ అయ్యేవరకు అతని మృ-తిపై ఎలాంటి ఖచ్చితమైన ప్రకటన చేయలేమని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు అతను ఆ--త్మ--హ--త్యకు పాల్పడలేదని తెలుస్తోందని చెప్పారు. శ్రీనివాస రావు కుమారుడు మహేష్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు అదృశ్యం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నట్లు చెప్పారు. లాగ్ బుక్ లో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి అదృశ్యమవ్వడంతో మిస్సింగ్ కేసు పెట్టామని అన్నారు. ఆయన కాల్ డీటెయిల్స్ తీస్తే నలుగురితో చాలా సేపు మాట్లాడినట్టు గుర్తించామని తెలిపారు. కాల్ డేటా లో ఉన్న పిలకా అప్పుల రెడ్డి, అడపా హరీష్ లను విచారించామని పేర్కొన్నారు. వారికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 50 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలిందన్నారు. వీటికి సంబందించి ఆర్.ఎన్. ఐ.ఎల్ కి డబ్బు కట్టినట్టు ఫేక్ డీడీ లు చూపించారని చెప్పారు. అలాగే శ్రీనివాస రావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా గుర్తించామని అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్టు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. అతని ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారని తెలిపారు.అయితే స్టీల్ ప్లాంట్ నుంచి అతను బయటకు వచ్చినట్టు సీసీఫోటేజ్ ఉందని చెప్పారు. దీని పై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని అన్నారు. మాకున్న సమాచారం మేరకు స్టీల్ ప్లాంట్ లో అతను ఎటువంటి ఆఘాయిత్యనికి పాల్పడలేదని అన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ లో పడి ఆ--త్మ--హ--త్య చేసుకోవడం అసాధ్యం అని అధికారులు కూడా తెలిపారని పేర్కొన్నారు. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అన్నారు. గతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక్కడే దేవిపురం అలాగే విజయవాడ వరకు కూడా నడిచి వెళ్లినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు.

ఆ విధంగానే ఇప్పుడు కూడా అతను అలా వెళ్లి ఉంటాడనే భావిస్తున్నామని తెలిపారు. అయితే అతనిపై మరి కొన్ని ఆరోపణలు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఇద్దరు నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామనిరూ. 50 లక్షలు తీసుకున్నాడని, శనివారం ఉదయం రిజల్ట్ వస్తుందని నమ్మించాడని చెప్పారు. ఉద్యోగ వ్యవహారాల కారణంగానే బాధితులకు సమాధానం చెప్పాలిసి వస్తుందనే ఆలోచనతో అతను లేఖ రాసి మరి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మరో పదహారు మందికి కూడా ఆర్.ఐ.ఎన్.ఎల్. లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిచినట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఫోర్ మన్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావుజి లాగ్ బుక్ లో ఆ--త్మ--హ--త్య చేసుకుంటానని రాసుకున్నాడని, రాత్రి 10 గంటలకు విధులకు హాజరయ్యాడని తెలిపారు. కానీ శనివారం అతను కనిపించకుండా పోయారని చెప్పారు. శ్రీనివాసరావు అదృశ్యం పై మిస్సింగ్ కేసు నమోదు చేశామని వెల్లడించారు. పోలీసుల ఆరోపణలు అవాస్తవం... తన తండ్రి శ్రీనివాస రావు పై పోలీసులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని శ్రీనివాస రావు కుమారుడు మహేష్ పేర్కొన్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కానీ పోలీసులు చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేవని అన్నారు.మా తండ్రి ఎవరికీ అన్యాయం తల పెట్టే వ్యక్తి కాదని అన్నారు. కరోనా వచ్చినపుడు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించే ఆలోచించేవారని తెలిపారు.

ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి మోసం చేశాడని పోలీసులు అంటున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ప్లాంట్ నుంచి సజీవంగా బైటికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారని కానీ ఆ విషయం లో తమకు ఎలాంటి నమ్మకం లేదని అన్నారు. ఆయన ప్లాంట్ లోపల వున్నారా ? మరెక్కడ వున్నాడో మాకు తెలియాలని చెప్పారు. మా తండ్రి ఏమయ్యాడో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు. నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్న...32 మంది ప్రాణాలర్పించి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసి స్టీల్ ప్లాంట్ నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచుతుందని ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస రావు ఆవేదన చెందారు. ఆయన ఈ ఉద్యమం లో తాను ఓ సమిధను అవుతానని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఒక లేఖ రాసి తాను అదృశ్యమయ్యారు. ఆ లేఖలో 'ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఉక్కు ఫర్నిస్ లో అగ్నికి ఆహుతి కావడానికి ఈ రోజు (శనివారం) 5:49 నిమిషాలకు ముహూర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి' అంటూ సూ-సై-డ్ నోట్ లో పేర్కొన్నారు. కాగా లేఖ రాసి పెట్టిన శ్రీనివాసరావు శనివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా స్పందించారు. ఉద్యోగి శ్రీనివాసరావు కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read