రాజధాని అమరావతిలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలోని, తుళ్లూరు మండలంలోని మందడం గ్రామం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఒకేసారి 26 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో ఐదు వేల మొక్కలను నాటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏడీసీ, సీఆర్డీయే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా అమరావతిలో 5.50 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విస్తీర్ణంలో సుమారు 23 శాతంలోనే మొక్కలు ఉన్నాయి. 2029 నాటికి దాన్ని 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ ఇచ్చారు...
అయితే ఈ సందర్భంలో నర్సారావు పేట సాయి తిరుమల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన, ఆకుల వనజారాణి అనే విద్యార్ధిని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది... ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ విద్యార్ధిని సన్మానం చేశారు.. అంతలా ఆ విద్యార్ధిని ప్రసంగం ఉంది... భవిష్యత్తు తరాల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబు లాంటి విజన్ ఉన్న సీఎంకి అండగా నిలవాలని, అధికారులు చేస్తున్న కృషికి మన వంతు సహకారంగా జన్మదినం తదితర శుభదినాల్లో మొక్కలు నాటాలని సహచర విద్యార్థులకు సూచించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి చక్కగా వివరించిన ఈ అమ్మాయి సీఎం చేత సన్మానం అందుకుంది...
ప్రసంగం చివర్లో తండ్రితోసహా అందరికీ కృతజ్ఞతలు తెలిపి, తల్లిని మర్చిపోవడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ ఆ విషయాన్ని గుర్తు చేశారు. ‘ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాతే ఎవరైనా’ అన్న ఆయన మాటలు సభికులను ఆకట్టుకున్నాయి... ఈ అమ్మాయే కాదు, రాజధాని గ్రీనరీ ప్రాజెక్టుకు శ్రీకారం సందర్భంగా పలువురు విద్యార్థులు వేదిక పై నుంచి ప్రసంగించారు. వారు చేసిన ప్రసంగాలు సీఎం చంద్రబాబును అమితంగా ఆకట్టుకున్నాయి.