వర్షపు నీరు..సాగు, తాగుకు ఆధారం. కాలం అనుకూలిస్తే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే వర్షపు నీరు లభ్యమవుతోంది. ఆ నీటిని సంరక్షించక పోవడం వల్లే దుర్భిక్ష పరిస్థితులు నెలకుంటున్నాయి. చెరువులు, కుంట లలో నిలువ చేసిన నీటిలో చాలా భాగం ఆవిరి రూపంలో వృథా అవుతోంది. నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలు సమృద్ధి పరచాలి. ప్రస్తుతం వర్షపు నీటి వినియో గం కేవలం పది శాతం మాత్రమే.. అందుకే ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలో ఇంకేటట్లు చూడాలి. ఇదే కార్యక్రమం కోసం, చంద్రబాబు వారంలో ఒక రోజు, నీరు - మీరు మీద సమీక్ష చేస్తూ, తగు సూచనలు ఇస్తూ, వివిధ రూపాల్లో, నీటి లభ్యత పెంచుతున్నారు... ఈ కోవలో, చంద్రబాబు విజన్ కు మరో ఉదాహరణ భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌)

cbn kadapa 18042018 2

ఈ విధానాన్ని కడప జిల్లలో, పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు. రూ.6 వేల కోట్లకు పైగా వెచ్చించి 92 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను జిల్లాలో నిర్మించినా వాటిలోకి నీరు చేరే పరిస్థితి లేకపోవడంతో సమస్యగా తయారైంది. జిల్లా మొత్తం భూగర్భం రాతినేల కావడంతో నీరు ఇంకడమన్నదీ గగనమే. దీంతో ప్రభుత్వం ఈ సమస్య పై ద్రుష్టి సారించింది. కడప భూమిలో నీటిని ఇంకింపజేయలేని క్రమంలో పాతాళాన్నే జలాశయంగా మార్చాలని భావించి భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌) నిర్మాణానికి సంకల్పించారు. పాపాఘ్ని నదిని ప్రయోగానికి ఎంచుకున్నారు. అందులో అధ్యయనం చేసి 6 చోట్ల డ్యాముల నిర్మాణం చేపట్టారు. రూ.26.36 కోట్ల వ్యయంతో 0.796 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణాలు చేపట్టి ఇటీవల పూర్తిచేశారు. కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని చక్రాయపేట, వేంపల్లి, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాల పరిధిలో ఆనకట్టలు ఏర్పాటయ్యాయి.

cbn kadapa 18042018 3

ప్రస్తుతం ఇక్కడ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు వట్టిపోయిన బోర్లు, బావుల్లోనూ జలసిరులు కనిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. సుమారు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు గుర్తించారు. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న 7795 ఎకరాల ద్వారా సుమారు 16,563 మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని లెక్కగట్టారు. వార్షిక జీవీఏ రూ.51.24 కోట్లు సాధించవచ్చన్నది అంచనా. అసలు ఏంటి ఈ భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌) ? ... వాటర్‌షెడ్‌ ప్రాంతంలో భూమిలోకి ఇంకింపజేసిన నీటిని కాపాడుకోవాలి. నిల్వ ఉన్న భూగర్భ జలాన్ని వాడక పోయినా నీరు భూమిలో ప్రవహించి వాటర్‌ షెడ్‌ హద్దు దాటి పోయే అవకాశం ఉంది. భూగర్భ ఆనకట్టలు వాటర్‌ షెడ్‌ పరిధి అంచున కాల్వలా తవ్వి నిర్మించాలి. ఇది నది నీరు బయటకు పోకుండా చేసే అడ్డుగోడలా పని చేస్తుంది. ఈ కట్టడాన్ని హెచ్‌డీపీఈ ఫిల్మ్‌తో కప్పినట్టయితే నీరు బయటకు రాదు. మామూలు భూగర్భ జలాల సంరక్షణకు అయ్యే ఖర్చులో కేవలం నాలుగో వంతు ఖర్చుతో ఈ నిర్మాణం పూర్తి చేయవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read