కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. తరువాత శ్రీవారి ఆలయన్ని మన ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో లేకుండా చెయ్యాలని ప్లాన్ వేసారు. దీనికి బీజం వేస్తూ, తిరుమలను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరు చెయ్యవలసిందిగా సుప్రీంలో కేసు వేసారు రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత సుభ్రమణ్య స్వామి. ఈ విషయం పై అప్పట్లో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. ఇలా కేసులు వేసి, మన వెంకన్న స్వామిని తన, హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలని, బీజేపీ పన్నాగం పన్నింది. అయితే కేంద్రం కంటే, రాష్ట్రం కంటే, వెంకన్నకు తనని తాను కాపాడుకోవటం బాగా తెలుసు. పావురాల గుట్ట సాక్షిగా అది రుజువైంది కూడా. టీటీడీ పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్ట్ లో తేల్చుకోవాలని చెప్పెంది. దీంతో ఈ కేసు హైకోర్ట్ కు వచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన గత మూడేళ్ల ఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిట్ నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా (రిజర్వు) వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సోమవారం విచారణలో సుబ్రమణ్యస్వామి నేరుగా వాదనలు వినిపిస్తూ.. దేవాలయాల నిర్వహణలో వివాదం తలెత్తినప్పుడే పరిపాలనాంశాల్లో ప్రభుత్వానికి పరిమిత కాలంతో అజమాయిషీ ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
ఆలయాల నిర్వహణ ప్రభుత్వం పనికాదని స్పష్టంగా పేర్కొందని తెలిపారు. 85ఏళ్ల నుంచి ప్రభుత్వం తితిదేను నియంత్రిస్తోందని చెప్పారు. సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తితిదే విషయంలో ప్రభుత్వ జోక్యం లేదని తెలిపారు. తితిదే వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఉందని చెప్పారు. తితిదే తరఫు న్యాయవాది లలిత వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ అధికారి (ఎఫ్‌ఏసీఏవో) ఆడిట్ వ్యవహారాలను చూస్తుంటారని వెల్లడించారు. ఆడిట్ నిర్వహించలేదని పిటిషనరు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.