మేకతోటి సుచరిత.. హోంమంత్రిగా చేసిన మహిళ. దళిత సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో, ఆమెకు సామాజిక సమీకరణాలతో మంత్రి పదవి ఇచ్చారు. పేరుకే హోంమంత్రి కానీ, ఆమె ఏ నాడు ఆ అధికారం వినియోగించ లేదనే చెప్పాలి. సుచరితకు షాడో మంత్రిగా సజ్జల ఉండే వారు. సజ్జల ఏమి చెప్తే అదే జరిగేది. పైకి పేరుకి మాత్రమే సుచరిత ఉన్నారు అని, హోంశాఖ మొత్తం సజ్జల చెప్పినట్టే నడుస్తుంది అనేది బహిరంగ రహస్యమే. నిన్న జరిగిన మంత్రివర్గ మార్పుల్లో సుచిరతకు స్థానం ఇవ్వలేదు. ఎస్సీల్లో, పాత వారిని అందరినీ ఉంచారు కానీ, సుచరితను మాత్రం పీకేసారు. వారికి ఉన్న అర్హతలు ఏమిటి, తనకు లేని అర్హతలు ఏమిటి అంటూ ఆమె రగిలిపోయారు. నిన్నటి నుంచి సుచరిత వర్గీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. వైసీపీలో రెడ్లకు ఒక న్యాయం, ఎస్సీలకు ఒక నయయమా అని నినాదాలు చేసారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి సుచరిత అభిమానాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. సుచరిత అనేక సార్లు సజ్జలను కలవటానికి ప్రయత్నం చేసినా, సజ్జల కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, సుచరిత అభిమానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుచరితను, సజ్జల అవమానించారు అంటూ, సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
ఇక ఇక్కడ గమనించాల్సిన మరో అంశం, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి రాలేదని అలిగితే, సజ్జల ఆయన ఇంటి చుట్టూ, మూడు సార్లు తిరిగారు. చివరకు బాలినేనిని జగన్ వద్దకు తీసుకుని వెళ్లి సెటిల్మెంట్ చేసి పంపించారు. అయితే సుచరిత వద్దకు మాత్రం, నిన్న ఎంపీ మోపిదేవిని పంపించి, చేతులు దులుపుకున్నారు. ఈ రోజు ఆమె రాజీనామా చేస్తున్నా అని కార్యకర్తలతో ప్రకటించినా, ఎవరూ ఆమె వద్దకు వైసీపీ నుంచి రాలేదు. దీంతో సుచరిత వర్గీయులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అంతలా బుజ్జగించి, సుచరితని కనీసం పట్టించుకోలేదని, హోం మంత్రి ఇచ్చి, ఏమి లాభం అంటూ నిరసన తెలిపారు. జగన్ కోసం, మొదటగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది సుచరిత అని గుర్తు చేస్తున్నారు. అలాగే ఆమె భర్తను వరం రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినా, ఆమె ఏమీ మాట్లాడలేదని, ఈ రోజు సుచరితకు ఇంత అన్యాయం జరిగితే, జగన్ మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.