ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరితకు సంబంధించిన షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్ కు చెందిన అంశం పైన, నేషనల్ ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది. మేకతోటి సుచరిత రెండేళ్ళ క్రితం ఇచ్చిన ఒక యుట్యూబ్ ఇంటర్వ్యూలో, ఆమె, తాను క్రిస్టియన్ అని స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ వీడియో పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ, నేషనల్ ఎస్సీ కమిషన్‌కు మేకతోటి సుచరిత పై ఫిర్యాదు చేసింది. ఆమె క్రీస్టియన్ అని చెప్తున్నారని, మరి మతం మారకుండా, రిజర్వేషన్ ఎలా అనుభవిస్తారు అంటూ ఫిర్యాదు చేసారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇచ్చిన ఫిర్యాదు పై, విచారణ జరిపి, తమకు ఇవ్వాలి అంటూ వారం రోజులు టైం ఇచ్చి, గుంటూరు కలెక్టర్ ని నివేదిక ఇవ్వమంటూ, జాతీయ ఎస్సీ కమిషన్, గుంటూరు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మేకతోటి సుచరిత, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయ్యారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గం మాత్రం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అయితే ఆమె క్రీస్టియన్ అనే విషయం గ్రౌండ్ లెవెల్ లో అందరికీ తెలుసు అని, స్వయంగా ఆమె కూడా ఒక ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నారని, ఎస్సీ హోదాను ఆమె దుర్వినియోగం చేసారని ఫిర్యాదు ఇచ్చారు.

suchiarita 28082021 2

దీంతో ఈ ఫిర్యాదు పై స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్ విచారణ చేసి తమకు నివేదిక ఇవ్వాలి అంటూ, గుంటూరు జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. అయితే ఇక్కడే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేకతోటి సుచరిత ఒక పక్క ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. అలాంటి హోంమంత్రి పై అదే జిల్లాకు చెందిన కలెక్టర్ ఎలా విచారణ చేస్తారని ? ఎలా రిపోర్ట్ ఇస్తారు అంటూ, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులే డైరెక్ట్ గా వచ్చి విచారణ చేయటం కానీ, లేదా పక్క రాష్ట్రాల ఐఏఎస్ లకు విచారణ చేయమని చెప్పాలి కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి గుంటూరు కలెక్టర్ ఒత్తిడికి తలొగ్గకుండా, ఎలాంటి నివేదిక ఇస్తారో చూడాలి. ఇక పొతే హోంమంత్రి మాత్రమే కాదు, ఇతరుల పై కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. అలాగే మాజీ కలెక్టర్ శామ్యూల్‌, అలాగే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మతపరమైన కామెంట్స్ చేసారు అంటూ ఫిర్యాదులు అందాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read