మంత్రివర్గ విస్తరణలో, స్థానం కోల్పోయిన ఎంతో మంది ఎమ్మెల్యేలు రోడ్డెక్కి రచ్చ రచ్చ చేసారు, టైర్లు తగలబెట్టారు, సియం డౌన్ డౌన్ అన్నారు, ఇలా అనేక ఆందోళనలు చేసారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కోటంరెడ్డి, ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేస్తే, అందరినీ బుజ్జగించిన వైసీపీ అధిష్టానం, సుచరిత పై మాత్రం సీరియస్ అయ్యింది. ఆమె తన మంత్రి పదవి ఊడబీకటం పై వైసీపీ అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా, మంత్రి పదవి కంటే కూడా, సజ్జల అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం పై, ఆమె రగిలిపోతున్నారు. తన ఆత్మగౌరవం దెబ్బతిందని ఆమె భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. రాజీనామా లేఖను తన వద్దకు దూతగా వచ్చిన మోపిదేవికి ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత అభిమానాలు, మోపిదేవిని అడ్డుకున్నారు. అయితే మోపిదేవి వెళ్ళిన తరువాత, ఒక్కరు కూడా మళ్ళీ సుచరిత వద్దకు రాలేదు. బాలినేని వద్దకు సజ్జల, పిన్నెల్లి దగ్గరకు పెద్దిరెడ్డి ఒకటికి మూడు సార్లు వెళ్లి బుజ్జగించారు కానీ, సుచరిత వద్దకు మాత్రం ఎవరూ వెళ్ళలేదు. దీంతో ఆమె ఆత్మగౌరవం మరింత దెబ్బతింది. హోంమంత్రిగా చేసిన మహిళకు, వైసీపీ పార్టీలో దక్కిన న్యాయం ఇదా అని ప్రశ్నిస్తున్నారు.

sucharita 12042022 2

అయితే సుచరిత వైఖరి పై, వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. రాజీనామా లేఖ ఇవ్వటం, అలాగే మోపిదేవిని అడ్డుకోవటం, సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఇవన్నీ వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. ఆమె మాట్లాడకుండా, ఆమె కూతురితో మీడియాతో మాట్లాడించటం పై ఆగ్రహంగా ఉన్నారు. హోంమంత్రి పదవి ఇచ్చి, డిప్యూటీ సియం పదవి ఇచ్చినా, ఆమె ఇలా చేయటం ఏమిటి అంటూ వైసీపీ అధిష్టానం ప్రశ్నిస్తుంది. అయితే సుచరిత మాత్రం, నలుగురు ఎస్సీలు ఉంటే, ముగ్గురికి మంత్రి పదవి కంటిన్యూ చేసారని, తనని ఎందుకు తీసారు అని అడిగితే సమాధానం చెప్పలేదని, సజ్జల వద్దకు వెళ్దామని అపాయింట్మెంట్ అడిగినా తనను పట్టించుకోలేదని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని ఆమె వర్గీయులు అంటున్నారు. అయితే సుచరితతో మాత్రం ఎలాంటి బుజ్జగింపులు చేయని వైసీపీ అధిష్టానం, ఆమె పై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెకు ముందుగా షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాసం ఉందని ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read