ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ కొత్త చిచ్చుకి తెర లేపింది. నిన్నటి వరకు పాత మంత్రుల్ని అందరినీ తీసి వేస్తారని, కేవలం ఇద్దరు సీనియర్ మంత్రులు ఉంటారాని ప్రచారం జరిగింది. దీంతో మంత్రులు అందరూ, మనతో పాటు అందరూ పోతున్నారు కదా అని ఫిక్స్ అయ్యారు. అయితే, ఈ రోజు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఏకంగా 11 మంది పాత మంత్రులు కంటిన్యూ అయ్యారు. దీంతో ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారు, తమకు వాళ్ళకు తేడా ఏమిటి అంటూ అలక పాన్పు ఎక్కారు. ఇందులో ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉదయం నుంచి ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆయనకు బీపీ కూడా పెరిగి, డాక్టర్లు వచ్చే దాకా అయ్యింది. ఇక ఇప్పుడు కొద్ది సేపటి క్రితం, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఆగ్రహం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, తాను రాజీనామా చేస్తాను అనే దాకా ఈ ఆగ్రహం వెళ్ళింది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డితో ,మాట్లాడటానికి ప్రయత్నం చేసినా, ఆయన పట్టించుకాలేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఆమె రగిలిపోతున్నారు. దీంతో సుచరిత ఇంటికి భారీగా అభిమానులు, దళిత సంఘాలు చేరుకున్నాయి. రెండు రోజులుగా సుచరిత కలిసేందుకు ప్రయత్నించినా సజ్జల అవకాశం ఇవ్వలేదని సుచరిత వర్గీయుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

sucharita 10042022 1

ఈ నేపధ్యంలో ఆమె వర్ఘీయులు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, రాజీనామాకు సిద్ధ పడ్డారు. అయితే సుచరిత కూడా రాజీనామా చేస్తారని, స్పీకర్ ఫార్మాట్‍లో రాజీనామాకు సిద్ధం అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఆమె స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం చెప్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఏమి అవుతుందో చూడాలి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కోటం రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, శిల్పా చక్ర పాణి రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఉదయభాను, పార్ధసారధి, ఇప్పుడు సుచరిత ఈ లిస్టు లో చేరారు. ఇంకా ఈ లిస్టు లో ఎంత మంది వచ్చి చేరతారో చూడాలి. చాలా మంది ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరో పక్క, ఈ అసంతృప్తులు ఈ స్థాయిలో ఉంటాయని, వైసీపీ అధిష్టానం ఊహించలేక పోయింది. దీంతో సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. మరోసారి బాలినేనిని బుజ్జగించటానికి సజ్జల ఆయన ఇంటికి వెళ్లారు. ఇక మిగతా జిల్లాల్లో రీజనల్ కో-ఆర్డినేటర్లకు బుజ్జగింపు బాధ్యతలు అప్ప చెప్పారు. అసంతృప్తులతో మాట్లాడి తనవద్దకు తీసుకురావాలని జగన్ ఆదేశించారని సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read