ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఉపయోగం లేదా ? లేదా ఆ జీవోలో పెట్టిన కంటెంట్ వల్ల ఉపయోగం లేదా ? ఏది ఏమైనా, ప్రభుత్వం ఇచ్చిన జీవోకి విలువలేదని, బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఏకంగా సిబిఐ చెప్పింది అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకి పడేసారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలను మీడియా ముందే చించి పడేసారు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. మరి ఇంత సంచలనం సృష్టిస్తూ, ఏకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఫేక్ అని ఆరోపణలు చేస్తుంటే, ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది ? ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెప్తారు ? గొప్పగా చెప్పుకుని, మీడియాకు ఫోటోలు విడుదల చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చెప్తారు ? ఈ ప్రశ్నలకు, జవాబులు ప్రభుత్వం ఏమి చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, 2017లో కర్నూల్ లో సుగాలి ప్రీతిబాయి అనే విద్యార్థిని హత్యాచారం కేసు సంచలనంగా మారింది. అప్పటి ప్రభుత్వం విచారణ వద్దని, తమకు సిబిఐ విచారణ కావాలి అంటూ, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ కుటుంబం ఆందోళన చేస్తూనే ఉంది. ఆమె తల్లి విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి పోరాటానికి , పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఆమె ఆందోళన కొనసాగింది. అయితే 8 నెలల క్రితం కర్నూల్ పర్యటనకు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి వద్దకు, ఆమె తల్లి వచ్చి నిరసన తెలిపారు. జరిగిన విషయం చెప్పారు. తమకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై నమ్మకం లేదని, సిబిఐ విచారణ కావాలని కోరారు.

cbi 06122020 2

దీంతో ఈ ఇష్యూ హైలైట్ అయిన విషయం కావటం,మీడియాలో తరుచూ వచ్చే అంశం కావటంతో, జగన్ మొహన్ రెడ్డి కూడా, తమకు రాజకీయంగా కూడా కలిసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, సిబిఐ విచారణకు ఇస్తాం అని ప్రకటన చేసారు. తరువాత జీవో కూడా ఇచ్చారు. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు. ఇంకేముంది జగన్ మోహన్ రెడ్డి మీడియా, పేపర్ లు, సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం, దుమ్ము లేపారు. సరే తప్పేముంది, చేసారు , ప్రచారం చేసుకుంటున్నారు, ఆమెకు న్యాయం జరిగితే చాలు కదా అని అందరూ అనుకున్నారు. అయితే 8 నెలలు తరువాత సుగాలి ప్రీతి తల్లి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి జీవో ఇచ్చి ఇన్నాళ్ళు అయినా, సిబిఐ విచారణ జరగటం లేదని, ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ కు వెళ్ళగా, వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యామని అన్నారు. అక్కడ అధికారులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎందుకు పనికిరదాని చెప్పారని, దీంతో విచారణ చేయలేం అని చెప్పారని అన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, జగన్ మోహన్ రెడ్డి ఒక ఫేక్ జీవో ఇచ్చారని చెప్పి, ఆ జీవో కాగితాలు ప్రెస్ ముందే చింపేసారు. తమ పోరాటం కొనసాగుతుందని, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. మరి ప్రభుత్వం, ఈ వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read