‘‘జగనన్నా.. ఈ నిందలు భరించలేను. నేను చనిపోతున్నా’’ అంటూ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేసిన కొద్ది సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అధిక డోసేజ్‌లో మత్తు ఇంజక్షన్‌ చేసుకుని, చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పూతలపట్టు నుంచి వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన సునీల్‌కు తాజా ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు ఇవ్వదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 4 రోజుల కిందట సునీల్‌ హైదరాబాద్‌లో లోట్‌సపాండ్‌లో జగన్‌ను కలిసేందుకు తన భార్య డాక్టర్‌ మమతారాణితో కలసి వెళ్లారు. అయితే జగన్‌ను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో సునీల్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

108 26112018 1

తనపై ఎంత రాజకీయ ఒత్తిడులు వచ్చినా పార్టీకి విధేయుడుగా ఉన్నప్పటికీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ముందు తాను పడిన మానసిక ఒత్తిడి, అవమానాలపై సునీల్‌ ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో దీనిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ చంద్రమోహన్‌ హు టాహుటిన సిబ్బందితో కలసి పలమనేరులోని సునీల్‌ ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇంటికి తాళాలు వేసి ఉండడంతో సునీల్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌ మమతారాణి తీసుకొని తాము క్షేమంగానే ఉన్నామని సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌ చేసేశారు. అయితే, స్థానికుల సమాచారం మేరకు ఓ చర్చిలో ఉన్నట్లు తెలుసుకుని, అక్కడకు వెళ్లి పరిశీలించగా అక్కడ సునీల్‌ ఎడమచేతి మణికట్టు వద్ద బ్యాండేజ్‌ కట్టి ఉండడంతో పాటు సెలైన్‌ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన క్యాన్‌లా కుడి చేతికి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నాన్ని సునీల్‌ భార్య అడ్డుకున్నారు. తాను డాక్టర్‌నని, వైద్యం చేసుకుంటానని బదులివ్వడంతో పోలీసులు వెనుదిరిగి, అక్కడ కాపలా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి ముందు పూతలపట్టు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని రోదించారు.

 

108 26112018 1

శనివారం సాయంత్రం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆవేదన ఆయన మాటల్లోనే.. ‘జగన్‌మోహన్‌రెడ్డి గారికి నమస్కారం. అన్నా.. మీరంటే నాకు చాలా ప్రేమ. మొదటిసారి నాకు టికెట్టు ఇప్పించారు. డాక్టర్‌ అనే గౌరవంతో నాకు ప్రజాసేవ చేసుకునేందుకు ఓ అవకాశం ఇచ్చారు. మీరంటే ఎంత పిచ్చంటే.. నా లోకమే మీదైపోయింది. లేచినప్పటి నుంచి పేపర్లో, టీవీల్లో మీ ముఖం చూస్తే గానీ ఆ రోజు నాకు గడవదు. ఎంతగా నా జీవితం మీతో పెనవేసుకుపోయిందో నేను చెప్పలేను. మీ దగ్గరగా వచ్చినప్పుడు రెండు మూడు మాటల కంటే ఎక్కువ మాట్లాడలేను. అదొక ఆనందం. నేను ప్రేమించే వ్యక్తి, నేను ఆరాధించే వ్యక్తిని దగ్గరగా చూసినప్పుడు నాకు మాటొచ్చేది కాదన్నా. కానీ, గత 10 రోజులుగా నా ప్రమేయం లేకుండా మీడియాలో వచ్చిన కథనాలు, కొంతమంది సొంత పార్టీ నాయకులు ‘ఈ అబ్బాయి టీడీపీ వాళ్లతో అమ్ముడుపోయేందుకు రెడీ అయ్యాడు కాబట్టే.. జగన్‌ గారు టికెట్టు ఇవ్వడం లేదు. ఇతన్ని దూరం పెడుతున్నాడ’ని ప్రచారం చేశారన్నా. నిజంగా నా మనసు చాలా బాధపడుతోందన్నా. మిమ్మల్ని కలిసి, అన్నా నాకు టికెట్టు కూడా అవసరం లేదు. నేను మీ మనిషిగా ఉంటాను. నేను అలాంటి తప్పుడు పని చేయను. నేను కూడా మీరు నమ్మే ఏసు ప్రభువునే ఇష్టపడతాను. ప్రార్థన చేస్తాను. అలాంటిది నా మనసు కుంగిపోయిందన్నా. గత వారం పది రోజులుగా చాలా కన్నీళ్లతో(విలపిస్తూ..) బాధ పడ్డాను. నేను ప్రేమించే వ్యక్తి విశ్వాసాన్ని నేను చూరగొనలేకపోయాను అనే ఒక బాధ. ‘ఈ అబ్బాయి చేతులారా చేసుకున్నాడు. జగన్‌ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు’ అని మా నాయకులు అంటున్నారు. ఇది తట్టుకోలేకపోతున్నా అన్నా. నాకు ఇద్దరు పిల్లలు. నాకు మంచి జీవితం ఉంది. డాక్టరుగా సంపాదించుకోగలుగుతాను. నేను కచ్చితంగా రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. కానీ, ఈ నిందను భరించలేకపోతున్నా అన్నా. నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నా అన్న. చనిపోయే వ్యక్తి నిజమే మాట్లాడతాడు అని లోకం నమ్ముతుంది.. కాబట్టి నేను చనిపోదలుచుకున్నాను. దయచేసి మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా మీరు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు’

Advertisements

Advertisements

Latest Articles

Most Read