ఏపీలో ఐటీ సోదాల సందడి సద్దుమణగకముందే... ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నై నుంచి వచ్చిన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌తో పాటు ఏపీలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. సీబీఐ మాజీ అధినేత విజయరామారావు కుమారుడు కె. శ్రీనివాస్‌ కల్యాణ్‌ రావుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సుజనా కంపనీలలో దాడి చేసినట్టు తెలుస్తుంది.

sujana 11102018 2

హైదరాబాద్‌లో విజయరామారావు కుమారుడు ఇంట్లో జరిపిన సోదాల్లో ఒకే చిరునామా పై వందకుపైగా కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, అందుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం (పీఎల్‌ఎంఏ) కింద కోట్ల రూపాయల బ్యాంకు రుణాలకు చెందిన పత్రాలను, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, పలు అగ్రిమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తప్పుడు సమాచారం, నకిలీ ధ్రువపత్రాలతో శ్రీనివాస్‌ బ్యాంకులను రూ.300 కోట్ల మేరకు మోసగించినట్లు 2016లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లోనూ శ్రీనివాస్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

sujana 11102018 3

కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు అప్పట్లో శ్రీనివాస్‌ కార్యాలయాలు, ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో సుజనా చౌదరి సంస్థలతో శ్రీనివాస్‌ ప్రమేయానికి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. వందల కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, చెన్నై బృందం నిర్వహించిన తనిఖీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ హైదరాబాద్‌ జోన్‌ విభాగం వెల్లడించింది. మరోవైపు, శ్రీనివాస్‌ సంస్థలతో తమకు లావాదేవీలు ఉన్నందున ఆ వివరాలు తెలుసుకునేందుకే ఈడీ అధికారులు వచ్చారని, తమ కంపెనీల పై ఎలాంటి దాడులు జరగలేదని సుజనా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read