సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు... కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేసారు... అయితే, గత కొన్ని రోజులుగా వైసిపీ, బీజేపీ, జనసేన కలిసి, సుజనా చౌదారి పార్టీ మారుతున్నాడు అని, చంద్రబాబు పై నమ్మకం లేక, బీజేపీ పార్టీలో చేరుతున్నారని, ప్రచారం మొదలు పెట్టారు... కొన్ని వార్తా చానల్స్ అయితే, స్పెషల్ ప్రోగ్రామ్ లు కూడా వేసాయి... గతంలో ఎన్నో సార్లు, సుజానా ఈ పుకార్లు ఖండించినా, ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు... ఈ రోజు తిరుపతి సభ కంటే ముందే, ఈ రోజు ఉదయమే, అమిత్ షా సమక్షంలో, బీజేపీ లో చేరుతున్నారని, తద్వారా చంద్రబాబుని దెబ్బ కొట్టాలని అమిత్ షా ప్లాన్ అంటూ ప్రచారం చేసారు... కట్ చేస్తే, ఇలాంటి వారి ఆశల పై నీళ్ళు జల్లుతూ, సుజనా చౌదరి, తిరుపతి సభలో, మోడీని ఎండగట్టారు...
సుజనా మాట్లాడుతూ, "చాలా ఓపికగా నాలుగేళ్లు వేచి చూశాం... రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేం కేంద్ర మంత్రివర్గంలో చేరాం... సీఎం ఆదేశాల ప్రకారమే అక్కడ మంత్రులుగా పనిచేశాం... భాజపా ఎజెండా మాపై రుద్దే ప్రయత్నం చేశారు...పార్లమెంటు ఆమోదం పొందిన విభజన బిల్లును కూడా కేంద్రం లెక్కచేయట్లేదు.. 14వ ఆర్థిక సంఘం పేరుతో కాలయాపన చేశారు... చట్ట ప్రకారం మనకు రావాల్సిందే ఇవ్వాలని అడిగాం... రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమే పనిచేశాం... నాలుగేళ్ల ముందే రాజీనామాలు చేసి ఉంటే ఇబ్బందులు పడేవాళ్లం..ఆర్థిక లోటు, రైల్వే జోన్ ఏర్పాటుపై అశ్రద్ధ చేశారు"
"కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో ఇలానే చేశారు...పసికందు లాంటి రాష్ట్రానికి పోషకాహారం ఇవ్వకుంటే ఎలా? ..మనం ధర్మపోరాటం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ విశాఖలో అధర్మ పోరాటం చేస్తోంది ..చట్ట ప్రకారం రావాల్సిన హక్కులను సాధించుకుని తీరుతాం" అంటూ ఎంపీ సుజనా చౌదరి ప్రసంగించారు.. మరో పక్క, తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని అభ్యర్థిగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు తెదేపా ఈ సభను ఏర్పాటుచేసింది.