గుడిని మింగే వాడుంటే గుళ్లో లింగాన్ని మింగే వాడు ఒకడు ఉంటాడు అనే సామెత మనం తరుచు వింటూ ఉంటాం. అయితే, ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పనులకు సరిగ్గా సరిపోతుంది. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో అంతా అవినీతి జరిగి పోయింది, అంటూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన ప్రతి పని పై ఎంక్వయిరీల మీద ఎంక్వయిరీలు వేస్తూ, హడావిడి చేస్తున్నారు. అయితే జగన్ చేసే పనుల వల్ల చంద్రబాబుకి అయితే ఇప్పటి వరకు ఎలాంటి నష్టం రాలేదు. నష్టం అంతా మన రాష్ట్రానికి వస్తుంది. జగన్ చేసే సమీక్షల వల్ల ఇప్పటికే 42 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు కోర్ట్ కు వెళ్ళాయి. అంటే భవిష్యత్తులో, వీరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటం ఇక ఉండదు అనే చెప్పాలి. మరో పక్క అమరావతి ఆపటం వల్ల అంటూ ఎల్ అండ్ టీ ఇబ్బంది పడుతుంది, పోలవరం నుంచి నవయుగని వేల్లిపోమన్నారు.

sujana 04082019 2

ఇలా ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి ఇబ్బందే జరుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్టు, గుడిని మింగే వాడుంటే గుళ్లో లింగాన్ని మింగే వాడు ఒకడు ఉంటాడు. జగన్ చేసే పనుల వాల్, నష్టం మీ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అంటుంది బీజేపీ. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అనే విషయం జగన్ మర్చిపోతున్నారని, రెండు నెలల నుంచి ఎందుకు పనులు ఆగిపోయాయో కేంద్రం సమీక్ష చేస్తుందని, బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కంపెనీలను బెదిరిస్తున్నారని, దీని పై కూడా పార్లమెంట్ అయిపోయినే వెంటనే, ఢిల్లీ స్థాయిలో సమీక్ష ఉంటుందని అన్నారు. అలాగే 75 శాతం లోకల్ రిజర్వేషన్ విషయం కేంద్రం ద్రుష్టికి కూడా వచ్చిందని, ఎవరు ఎక్కడైనా పని చేసుకునే రాజ్యాంగం ఇచ్చింది అని, మిగతా రాష్ట్రాలు ఇలాగే ఆలోచిస్తే, ఎంతో ప్రమాదం అని, దీని పై కూడా కేంద్రం చర్చిస్తుందని, జగన మొండిగా వెళ్ళినా, ఇది కోర్ట్ లో నిలవదని సుజనా చౌదరి అన్నారు.

sujana 04082019 3

గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగితే, రాష్ట్రం నిరభ్యంతరంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకోవచ్చని, కాని దాని కోసమని ప్రాజెక్ట్ లు అన్నీ ఆపెయ్యటం ఏంటో అర్ధం కావటం లేదని సుజనా అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును కక్షతో రద్దుచేసినట్లు కనిపిస్తోందని సుజనా చౌదరి అన్నారు. జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి, అలాగే టెండర్ ఎందుకు రద్దు చేసారు, రాష్ట్రానికి ఆ హక్కు ఉందా, వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, అనే విషయం పై సోమవారం సమీక్ష చేస్తారని సుజనా చౌదరి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చారని, ఆయన నిర్ణయాల పై వేచి చూసే ధోరణిలో ఉందాం అనుకున్నా, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, వాటి వల్ల తీవ్ర నష్టం ఉండటంతో, కేంద్రం కూడా జోక్యం చేసుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read