ఒక పక్క పార్లమెంట్ లో ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై రెండు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు గోల గోల చేస్తున్నారు. ఇవాళ కేంద్రం దీని పై సమాధానమిస్తూ, హై కోర్ట్ ఏర్పాటుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అని చెప్పింది. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని, తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని కేంద్రం సమాధానం ఇచ్చింది. దానికి తెరాసా ఎంపీలు చంద్రబాబుకి ధన్యవాదులు చెప్తూ, జడ్జీల నియమాకాలు చేపట్టవద్దు అని కేంద్రాన్ని కోరారు. ఇంతలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మైక్ అందుకున్నారు... హైకోర్ట్ ఒక్కటేనా ? మిగతా ఉమ్మడి ఆస్తులు సంగతి ఏంటి ?
విభజన హామీలో మిగతా వాటి సంగతి ఏంటి అని గళమెత్తారు... అంతే కాదు, స్పెషల్ స్టేటస్, ప్యాకేజ్, అమరావతికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, నియోజకవర్గాల పెంపు, ఇతర హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. పీకి ఇచ్చిన విభజన హామీలు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన పార్లమెంట్‌లో ప్రస్తావించారు. విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు అంటే హైకోర్ట్ విభజన ఒక్కటేనా అంటూ కేంద్రాన్ని వైస్ చౌదరి నిలదీశారు...
ఈ సందర్భంలో స్పీకర్ మధ్యలో కలిపించుకుని, మీరు కేంద్ర మంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడండి అని అన్నారు. అవును.. నాకు గుర్తింది... నేను కేంద్ర మంత్రి హోదాలోనే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వివరిస్తున్నా అన్నారు.... విషయం చెయ్యి దాటుతుంది అనుకున్నారో ఏమో, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలగచేసుకున్నారు. విభజన సమస్యలు ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలన్నారు. అవసరమైతే కేంద్రం సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ తప్పుకుండా నెరవేర్చుతామని రొటీన్ డైలాగ్ చెప్పారు. హైకోర్టు అంశం మాత్రం సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు. అయితే, కేంద్ర మంత్రిగా ఉంటూ సుజనా చౌదరి ధిక్కార స్వరం వినిపించటం చూస్తుంటే, కేంద్రంతో రాష్ట్రానికి గ్యాప్ పెరుగుతుంది అనే విషయం స్పష్టమవుతుంది...