జగన్ ఒకడే కాదు, చంద్రబాబు కూడా అవినీతి పరులే అని చిత్రించడానికి జరుగుతున్న వికృత క్రీడ ఇది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉండే ఈ ఎంక్వైరీ రిజల్ట్ ఏదయినా కానీ వారు అనుకున్న లక్ష్యం మరక పూయడం. ఇది సియం రమేష్ తోనో, సుజనా తోనో, రేవంత్ తోనో ఆగదు. బిజెపి ప్రయత్నం టీడీపీ నీ, వైసిపి అవినీతి తో ఈక్వాల్ చేయడమే కాని, కేసులు నిరూపించడం కాదు. అందుకే రేవంత్ కాని, సియం రమేష్ కాని, సుజనా కాని, ఆధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి, ఇలాంటి దాడులని తిప్పి కొడుతూ, వివరణలు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా, ఇలా వివరణ ఇచ్చాడా ? ఇక్కడ ఎంత పెద్ద స్కెచ్ వేసారో, ఇట్టే అర్ధమై పోతుంది. ముందుగా దాడులు చేసి, వేల కోట్లు పట్టుకునట్టు లీక్ ఇస్తారు.
మరి వేల కోట్లు పట్టుకున్నప్పుడు, జగన్ లాగా చిప్ప కూడు తినిపించాలి కదా ? అరెస్ట్ చెయ్యకుండా, కనీసం మీడియాతో విషయం చెప్పకుండా, ఎందుకు వెళ్ళిపోతున్నారు ? రేవంత్ రెడ్డి కేసులో రైడ్ చేసిన సంస్థలు రెండు వేల కోట్లని లీకులు ఇచ్చాయి. సీఎం రమేష్ విషయం లో 4000 కోట్లు అన్నారు. చివరికి తేల్చింది ఏంటి ? ఏమి లేదు. ఇప్పుడు సుజనా కూడా 6000 కోట్లు అని ప్రెస్స్ రిలీజ్ ఇచ్చారు. ఆరు ఖరీదైన కార్లు, డమ్మీ కంపనీల పేరుతో ఉన్నాయని లీక్ ఇచ్చారు. ఒక సెన్సేషన్ కోసం ప్రత్యర్థి పార్టీ ల నాయకుల్లో ఒక రకమయిన జంకు కలిగించడానికి మోడీ షా బిజెపి చేస్తున్న కార్యక్రమం ఇది. అయితే, వీటిని, వెంటనే సరైన ఆధారాలు చూపించి తిప్పి కొడుతున్నారు.
సుజనా కూడా ఈ రోజు ఆ ఆరు కార్లకి సమబంధించి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా, బయట పెట్టారు. ఈడీ ఇష్టం వచ్చినట్టు తన పై బురద చల్లి, ఈ కార్లు దొంగ కార్లు అని చెప్పిందని, కాని ఇది వాస్తవం అంటూ ట్వీట్ చేసారు. తానేమీ తప్పు చేయలేదనీ, తనవద్ద ఉన్న కార్లు డొల్ల కంపెనీల నుంచి కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న కార్లు అన్నింటిని చట్టబద్దంగానే కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కార్ల కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల కాపీలను ఆయన బయటపెట్టారు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. సుజనా కాని, రమేష్ కాని, రేవంత్ కాని, ఎక్కడా జగన్ లాగా ప్రభుత్వంలో ఉండి కరప్షన్ కేసుల్లో ఇరుక్కోలేదు. వాళ్ళ కంపనీల్లో లోన్లు తీసుకున్నారని, లేక పొతే రిటర్న్స్ సరిగ్గా లేవని, ఆరోపణలు చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. అవి కూడా ఎప్పుడో 10-15 ఏళ్ళ నాటి ఇష్యూ పట్టుకుని గోల చేస్తున్నాయి. ఏ కంపెనీలో అయినా, ఇలాంటివి సహజం. కాని వేల కోట్లు అంటూ దొంగ లీకులు ఇచ్చి, ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు గేమ్ ఆడుతున్నారు. అసలు ఇన్ని వేల కోట్లు ఫ్రాడ్ చేస్తే, ఎందుకు ఇప్పటి దాకా అరెస్ట్ చెయ్యటం లేదు ? కనీసం చార్జ్ షీట్ ఎందుకు వెయ్యటం లేదు ? ఇక్కడే అర్ధమై పోతుంది కదా. ఒక్క చంద్రబాబుని ఎదుర్కోవటం కోసం, ఇన్ని రకాల వేషాలు.