పొత్తు వద్దనుకుంటే మా దారి మేము చూసుకుంటామని, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై ఆలోచించాల్సింది పోయి, సోము వీర్రాజు లాంటి నేతలు, ఇంకా రెచ్చగొడుతున్నారు... వీరికి తెలుగుదేశంతో పొత్తు ఉండటం ఇష్టం లేదో ఏమో కాని, సంయమనం పాటించాల్సిన టైంలో కూడా, రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తూ, ఏకంగా చంద్రబాబునే అంటున్నారు.. తాజాగా సోము వీర్రాజు, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది అంటూ, మీడియాకు ఎక్కారు... కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని మేం మర్చిపోమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు...

somu 28012018 3

మేం కూడా మిత్రధర్మమే పాటిస్తున్నామని, టీడీపీయే పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో నిధుల సేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు... సోము వీర్రాజు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది...

somu 28012018 2

అయితే సోము వీర్రాజు మోసం చేసారు అని అనటంతో, తెలుగుదేశం కౌంటర్ ఇచ్చింది... సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి సుజయ కృష్ణ రంగారావు మాట్లాడుతూ కౌంటరిచ్చారు." ఆ రోజు ఎవరైతే ఇండిపెండెట్స్‌గా నిలిచారో వారిని పూర్తిగా దూరం పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం స్థాయి చంద్రబాబు నాయుడే పార్టీ కేడర్‌కు ఆదేశాలివ్వడం జరిగింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి లేకుండా పోటీ చేసిన వారిని పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? బీజేపీ ఇలా మాట్లాడటం సబబుకాదు" అని మంత్రి ఘాటుగా స్పందించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read