విశాఖపట్ణణంలో ఇన్వెస్టర్ సమ్మిట్ ఘనంగా ఆరంభమైందని వైసీపీ సర్కారు ఊదరగొడుతోంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పెట్టుబడుల ప్రకటనపై సమన్వయం లోపించిందని స్పష్టమైంది. యంగ్ డైనమిక్ లేడీ మినిస్టర్ విడదల రజనీ 2 లక్షల కోట్లు అని చెప్పగా, సీఎం 13 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని సగర్వంగా చెప్పారు. అంబానీ, జీఎమ్మార్, జిందాల్ వంటి పారిశ్రామిక ప్రముఖులు హాజరు కావడం విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి కొంత ఇన్వెస్టర్ల లుక్ కనిపించింది. అయితే భోజనాలు, సమ్మిట్ కిట్ల వద్ద జరిగిన తోపులాటతో ఇన్వెస్టర్లు ఇలా కొట్లాటకి దిగారా అనే అనుమానాలు రాక మానవు. కొందరైతే మెడలో సమ్మిట్ ఎంట్రీ కార్డుతో భోజనాల కోసం గొడవ పడడం కనిపించింది. మరికొందరు లడ్డూ, పింగాణీ ప్లేటు, బుక్, పెన్ను ఉన్న కిట్ల కోసం ఎగబడి స్టాళ్లను విరగ్గొట్టేశారు. వీరా లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ప్రతినిధులు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. కోర్ అంటే వేదికపై సీఎంతో పాటు ఆశీసులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు తప్పించి కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో అత్యధికులు వైసీపీ సోషల్ మీడియా వాళ్లేనని తెలుస్తోంది. వీరు మరీ రఫ్‌గా కనిపిస్తున్నారని చివరి వరసలో పెట్టి, కొద్దిగా క్లాసుగా కనిపించే ఐ ప్యాక్ నార్త్ వాళ్లందరినీ ముందు వరసలో కూర్చోబెట్టారు. మరోవైపు ఐప్యాక్లో పనిచేసే తెలుగువాళ్లని సమ్మిట్ కి తీసుకెళ్లలేదని సమాచారం. ఎందుకంటే వారు వీళ్లు ఇన్వెస్టర్లు కాదు, ఐ ప్యాక్ ఎంప్లాయీస్ అని నోరు జారుతారనే భయంతో తీసుకెళ్లలేదని తెలుస్తోంది.
ఇన్వెస్టర్లు కాదు...వైసీపీ, ఐ ప్యాక్ కళాకారులు.. భోజనాల దగ్గర దొరికిపోయారు...
Advertisements